కేసీఆర్ వ‌రంగ‌ల్ టూర్‌లో ఎమ్మెల్యేకు అవ‌మానం.. ట్విస్టు ఇచ్చిన పెద్దిరెడ్డి!

ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ వ‌రుస‌గా జిల్లాల‌న్నీ తిరిగేస్తున్నారు.ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా అది సంచ‌ల‌న‌మే అవుతోంది.

ఎందుకంటే ఆయ‌న వెళ్లిన చోట వ‌రాల వ‌ర్షం కుర‌వ‌డ‌మో లేక స్థానిక నేత‌ల‌కు అవ‌మానాలు జ‌ర‌గ‌డ‌మో జ‌రుగుతోంది.అయితే ఈ అవ‌మానాలు జ‌ర‌గ‌డం వెన‌క కేసీఆర్ భాగ‌స్వామ్యం లేక‌పోయినా పోలీసులు, అధికారులే ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్నార‌ని స్థానిక నేత‌లు మండిప‌డుతున్నారు.

ఇక ఆయ‌న తాజాగా ఓరుగ‌ల్లు టూర్ కు వెళ్ల‌గా ఇది కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్ వ‌రంగ‌ల్ టూర్‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ టూర్‌లో న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుద‌ర్శ‌న్‌రెడ్డికి ఘోర అవ‌మానం జ‌రిగింది.సీఎం కేసీఆర్ ను క‌లిసేందుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి హ‌న్మ‌కొండ మీదుగా వెళ్లారు.

Advertisement

అయితే అక్క‌డే డ్యూటీ చేస్తున్న పోలీసులు, ఇత‌ర సెక్యూరిటీ ఆఫీస‌ర్లు అనుమ‌తి లేదంటూ హెడ్ క్వార్ట‌ర్స్ ద‌గ్గ‌రే ఆపేశారు.

దీంతో ఆయ‌న కారుదిగి పోలీసుల‌తో, సెక్యూరిటీ ఆఫీస‌ర్ల‌తో మాట్లాడారు.అయినా వారెంత‌కూ ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డ‌తో ఎమ్మెల్యే మ‌న‌స్థాపం చెంది ఆర్ అండ్‌బీ అతిథి గృహం వ‌ర‌కు న‌డుచుకుంటూనే వెళ్లారు.పోలీసుల తీరుప‌ట్ల అధికార పార్టీ ఇలా నిర‌స‌న తెల‌ప‌డం ఉమ్మ‌డి జిల్లాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింంది.

స్థానిక ఎమ్మెల్యేను సీఎంను క‌ల‌వ‌నీయ‌కుండా ఆప‌డ‌మేంటంటూ ప్ర‌జాప్ర‌తినిధులు మండిప‌డుతున్నారు.అంత మాత్రానికి సీఎం వ‌రంగ‌ల్ రావ‌డం దేనికంటూ ప్ర‌శ్నిస్తున్నారు.ఇప్ప‌టికే ఈట‌ల వ్య‌వ‌హారంతో ఉద్య‌మ‌కారుల‌కు అవ‌మ‌నాలు జ‌రుగుతున్నాయంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్న టైమ్‌లో ఇది జ‌ర‌గ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

కాగా ఈయ‌న కంటే ముందు జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ఇలాగే ప‌ర్మిష‌న్ ఇవ్వ‌కుండా అవ‌మానించారు అధికారులు.వారు కూడా అక్క‌డే నిర‌స‌న తెలిపారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఇలా కేసీఆర్ టూర్ మాత్రం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

Advertisement

తాజా వార్తలు