శాకుంతలం దర్శక నిర్మాతపై దిల్ రాజు అసంతృప్తి

Shakuntalam Movie Release Date Issue Dil Raju Angry On Gunashekhar Details, Dil Raju, Gunasekhar, Samantha, Samantha Shaakuntalam, Shaakuntalam Release Date, Producer Dil Raju, Shaakuntalam Postponed

సమంత హీరోయిన్ గా నటించిన శకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.గతంలోనే ఒకసారి విడుదల తేదీ అధికారికంగా ప్రకటించి వాయిదా వేయడం జరిగింది.

 Shakuntalam Movie Release Date Issue Dil Raju Angry On Gunashekhar Details, Dil-TeluguStop.com

తాజాగా మరో సారి ఈ సినిమా వాయిదా వేయడం కన్ఫమ్ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా ఇప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోలేదు.

దాంతో శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రావడం లేదని ప్రేక్షకులతో పాటు అంతా కూడా నిర్ధారించుకున్నారు.

ఈ సినిమా ను గుణశేఖర్ స్వీయ దర్శకత్వం లో నిర్మించాడు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా పై ఉన్న నమ్మకం తో మరియు గుణశేఖర్ పై ఉన్న నమ్మకం తో సమర్పించేందుకు ముందుకు వచ్చాడు.దిల్ రాజు సినిమా విడుదల చేస్తున్నాడు అంటే కచ్చితంగా అత్యధిక థియేటర్స్ తెలుగు రాష్ట్రాల్లో లభించడం ఖాయం.

అందుకే శాకుంతలం సినిమా కి కచ్చితంగా మంచి కలెక్షన్స్ వస్తాయని అంతా భావించారు.

Telugu Dil Raju, Gunashekhar, Samantha, Shaakuntalam, Shakuntalam-Movie

దిల్ రాజు కూడా ఫిబ్రవరి 17వ తారీకు కి పెద్ద ఎత్తున థియేటర్స్ బుక్ చేసి ఉంచాడట.కానీ గుణశేఖర్ అనూహ్యంగా శాకుంతలం సినిమా ను మరో సారి వాయిదా వేయడంతో దిల్ రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడని సమాచారం అందుతుంది.తాను చెప్పిన తేదీ కి కాకుండా మరేదైనా తేదీ కి విడుదల చేస్తే థియేటర్ల విషయం లో తాను ఏం చేయలేనంటూ దర్శక నిర్మాత గుణశేఖర్ తో దిల్ రాజు అన్నాడట.

Telugu Dil Raju, Gunashekhar, Samantha, Shaakuntalam, Shakuntalam-Movie

అయినా కూడా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయనే ఉద్దేశం తో ఈ సినిమా ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.సమంత ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యే పరిస్థితి లేని కారణంగా కూడా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.అసలు విషయం ఏంటో అనేది తెలియాల్సి ఉంది.కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube