షారుక్ ఇంటిదగ్గర మాయమైన మన్నత్ నేమ్ బోర్డ్?

బాలీవుడ్ స్టార్ హీరో, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న షారుక్ ఖాన్ కి సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతుంది.

 Shah Rukh Khan's 'mannat' Name Plate Worth Rs 25 Lakhs Goes Missing,shah Rukh Khan,gauri Khan,mannat Name Plate,social Media,shah Rukh Khan House-TeluguStop.com

ఇకపోతే షారుక్ ఖాన్ కి ఎంతో ఇష్టమైన తన ఇల్లు మన్నత్ ఇంటి గురించి గతంలో ఒక వార్త చక్కర్లు కొట్టింది.కేవలం ఈ ఇంటి ముందు మన్నత్ నేమ్ బోర్డు కోసం సుమారు 25 లక్షలు ఖర్చుచేసి ప్రత్యేకంగా షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ డిజైన్ చేశారని ఈ నేమ్ బోర్డ్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

నేమ్ బోర్డు గురించి గత కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇకపోతే షారుక్ ఖాన్ ఇల్లు చూడటం కోసం ఎంతోమంది అభిమానులు అక్కడికి వెళ్లి బయట నుంచి ఫోటోలు వీడియోలు తీసుకోవడం చేస్తుంటారు.

 Shah Rukh Khan's 'Mannat' Name Plate Worth Rs 25 Lakhs Goes Missing,Shah Rukh Khan,Gauri Khan,Mannat Name Plate,Social Media,Shah Rukh Khan House-షారుక్ ఇంటిదగ్గర మాయమైన మన్నత్ నేమ్ బోర్డ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒక అభిమాని ఇంటి ముందు వెళ్తూ తన ఇంటిని వీడియో తీశారు.అయితే ఈ వీడియోలో తన ఇంటి నేమ్ ప్లేట్ కనిపించకపోవడం గమనార్హం.

ఈ క్రమంలోనే ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది మన్నత్ నేమ్ బోర్డ్ మిస్సయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ.ఖరీదైన నేమ్ బోర్డ్ కావడంతో దొంగలు ఎవరైనా చోరీ చేశారేమో అంటూ కామెంట్ చేయగా మరికొందరు ప్రస్తుతం నేమ్ బోర్డులో కొన్ని మరమ్మతులను చేస్తున్నారని, ఈ మరమ్మతులు పూర్తి కాగానే తిరిగి నేమ్ బోర్డు అదే ప్లేస్ లో పెట్టనున్నట్లు షారుక్ సన్నిహితులు తెలియజేస్తున్నారు.తమ కుటుంబ స్థాయికి గౌరవార్థంగా గౌరీ ఖాన్ ప్రత్యేకంగా ఈ నేమ్ బోర్డ్ తయారు చేసినట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube