మనసుకు దగ్గరైన సినిమా అంటూ.. డబ్బింగ్ పనులు మొదలు పెట్టిన రాశిఖన్నా!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న నటి రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం ఈమె వరస తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

 Actress Raashi Khanna Farzi Movie Dubbing Work Complete Details, Rashi Khanna,-TeluguStop.com

ఈ క్రమంలోనే తెలుగులో నాగచైతన్య సరసన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్యాంక్యూ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.ఇకపోతే తమిళంలో కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

అజయ్ దేవగన్ సరసన రుద్ర అనే వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ వెబ్ సిరీస్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని ప్రస్తుతం వరుస అవకాశాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే హీరో షాహిద్ కపూర్ సరసన ఫర్జీ సినిమాలో నటిస్తోంది.

శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకున్న ఈ సినిమా ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతుంది.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియా ద్వారా రాశిఖన్నా పంచుకున్నారు.

సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈమె డబ్బింగ్ పనులను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే డబ్బింగ్ చెబుతున్న టువంటి ఫోటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

నా మనసుకు దగ్గరైన,నచ్చిన సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి అంటూ.డబ్బింగ్ చెబుతున్నటువంటి ఫోటోని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే తెలుగులో ఈమె నాగ చైతన్య సరసన నటించిన థాంక్యూ, గోపీచంద్ సరసన నటించిన పక్కా కమర్షియల్ చిత్రాలు రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube