' బండి ' ఓవర్ స్పీడ్ ? అన్నీ ఇబ్బందులే ?

తెలంగాణలో ఒక్కసారిగా వచ్చిన ఊపు తో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓవర్ స్పీడ్ తోనే దూసుకెళుతున్నారు.

వరుసగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీజేపి ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉండడం, టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత పెరుగుతుండడంతో, బండి సంజయ్ దూకుడు మరింత పెరిగినట్టుగా కనిపిస్తోంది.

వరుస విజయాలతో ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.దీనికి కేంద్ర బీజేపి పెద్దల మద్దతు కూడా ఉండడంతో సంజయ్ ఎక్కడా తగ్గడం లేదు.

ఎవరిని లెక్క చేయనట్టు గానే వ్యవహరిస్తున్నారనే టాక్ అప్పుడే మొదలైంది.గత కొంత కాలంగా సంజయ్ ప్రసంగాలు,  ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు కాస్తా శృతిమించినట్టు కనిపిస్తున్నాయి.

రాబోయే ఎన్నికల్లో బీజేపి విజయం ఖాయమని సంజయ్ బలంగా నమ్ముతున్నారు.దానికోసమే టిఆర్ఎస్ కు నిత్యం సవాళ్లు విసురుతూ ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేందుకు సైతం వెనుకాడటం లేదు.

Advertisement

 త్వరలోనే కెసిఆర్ జైలుకు వెళ్ళిపోతున్నారు అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.తెలంగాణలో పూర్తిగా కాంగ్రెస్ ను పక్కకు నెట్టి బీజేపి తెలంగాణలో బాగా బలం పెంచుకుంది  అనేది నిజమే అయినా ఆ స్పీడ్ మాత్రం కాస్త లిమిట్ లో ఉంటేనే మంచిదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

దుబ్బాక గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో సంజయ్ నాయకత్వంపై అందరికీ నమ్మకం పెరిగింది.పూర్తిగా సంజయ్ కారణంగానే ఆ ఎన్నికల్లో గెలిచారా అంటే లేదు.దుబ్బాకలో బీజేపి నుంచి పోటీ చేసిన  రఘునందన్ రావు స్థానికంగా బలంగా ఉండడం, ఎప్పటి నుంచో ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ప్రజా ఉద్యమాలు చేస్తూ , టిఆర్ఎస్ పోరాటం చేయడం ఇలా ఎన్నో అంశాలు దుబ్బాక లో బీజేపి విజయానికి కారణమ

య్యాయి. గ్రేటర్ లోనూ ఎక్కువగా సిట్టింగులకు మళ్లీ అవకాశం ఇవ్వడం కాస్త ప్రజావ్యతిరేకత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కోవడం, ఇలా ఎన్నో అంశాలతో బీజేపీకి బాగా కలిసి వచ్చింది.కాంగ్రెస్ పూర్తిగా బలహీనం కావడం ఇవన్నీ బిజెపి ప్రభావం మరింత పెరిగేలా చేశాయి.

దీంట్లో సంజయ్ పాత్ర కూడా ఉన్నా, పూర్తిగా సంజయ్ కారణంగా నే ఈ విజయాలు నమోదు అయ్యాయి అని చెప్పలేము.కేవలం సంజయ్ దూకుడు తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు .ఏపీ రాజకీయాలపై నా ఆయన స్పందిస్తున్నారు.ఇటీవల భగవద్గీత పార్టీ కావాలా,  బైబిల్ పార్టీ కావాలా అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
పిఠాపురంలో యూ.ఎస్.ఏ, ఎన్.ఆర్.ఐ సేవలు అభినందనీయం అంటూ నాగబాబు కామెంట్స్..!!

తిరుపతి లోక్ సభ ఎన్నికలలో బీజేపి తరఫున ప్రచారానికి దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.అందుకే జగన్ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు.అయితే సంజయ్ స్పీడు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందని, ఆ స్పీడ్ తో బీజేపీకి కలిసి వచ్చేది తక్కువే అయినా, డ్యామేజ్  మాత్రం ఎక్కువగా ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Advertisement

తాజా వార్తలు