తాజాగా జరిగిన ఎన్నికల్లో గత అధికార పార్టీ టిడిపి సంక్షేమ పథకాలు, ప్రజాకర్షక విధానాలతో పాటు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేయడం, అలాగే పరిశ్రమలకు ఐటీ కంపెనీలకు ఏపీని కేంద్ర బిందువుగా మార్చాలని ప్రయత్నం చేయడంలో చంద్రబాబు నాయుడు చాలా వరకు విజయవంతం అయ్యాడు అని చెప్పాలి.అయితే ఈ ఐదేళ్ల పరిపాలనలో చంద్రబాబు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో ముందున్న కూడా అవి క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతవరకు చేరువవుతున్నయి అనే విషయాన్ని తెలుసుకోలేకపోయాడు.
ఇక జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పంచాయతీల్లో సర్పంచులని పక్కనపెట్టి పరిపాలన చేయాలని భావించిన చంద్రబాబుకి వాస్తవాలు తెలియకుండా పోయాయి.దీంతో టిడిపి పార్టీ నుంచి గెలిచిన పంచాయతీ సర్పంచ్లు కూడా చంద్రబాబు మీద తీవ్ర అసహనంతో ఉండేవారు.
అయితే ఐదేళ్ల కాలంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏ రోజు కూడా తెలుసుకోలేక పోయారు.దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండే కొంతమంది నేతలు వాస్తవాలను దాచి పరిపాలన అద్భుతంగా ఉందని సంక్షేమ పథకాలు ప్రజలకు అద్భుతంగా అవుతున్నాయని నమ్మించే ప్రయత్నం చేసినట్లు ఇప్పుడు ఆ పార్టీలో కొంతమంది కీలక నేతలు నేరుగా అధినేత ముందే ప్రస్తావిస్తున్నారు.
ఇంతకాలం పార్టీలో జరుగుతున్న ఇలాంటి రాజకీయాలపై కొంత అసహనం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది సీనియర్ నాయకులు మిన్నకుండిపోయారు.అయితే ఓటమి తర్వాత చంద్రబాబునాయుడు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు.

దీంతో చాలామంది నాయకులు అసలు సంక్షేమ పథకాలు భారీ స్థాయిలో అమలు చేసిన కూడా ఓడి పోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని చెప్పారు.అందులో ఎన్నికల్లో టిడిపి పార్టీ ఓటమికి కారణం చంద్రబాబు నాయుడు తరచుగా చేసే కాన్ఫరెన్స్ లే అని తేల్చేశారు.వీటి కారణంగా అధినేతకు వాస్తవాలు చెప్పే అవకాశం రాలేదని స్పష్టం చేశారు.అలాగే సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో చేర్చడంలో టిడిపి పార్టీ క్రింది స్థాయి నాయకులు పూర్తిగా విఫలమయ్యారని, ఈ ప్రభావం టిడిపి గెలుపు అవకాశాలను పూర్తిగా దెబ్బ తీసిందని కూడా కొంతమంది నాయకులు చెప్పినట్లు సమాచారం.
అలాగే పదేపదే ప్రచారం చేయడం కూడా ప్రజలు విశ్వసించలేదని సీనియర్ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.







