ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‎గా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు

ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‎గా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు నియమితులయ్యారు.నామినేటెడ్ పదవుల భర్తీలో దూకుడు పెంచిన ప్రభుత్వం కీలక పదవులను భర్తీ చేస్తుంది.

తాజాగా ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని నియమించిన విషయం తెలిసిందే.ఆ నియామకం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పదవిని భర్తీ చేసింది.

కేబినెట్ హోదాలో కొమ్మినేనిని ప్రెస్ అకాడెమీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పదవిలో కొమ్మినేని రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు