వైసీపీ మంత్రి రోజా( YCP minister Roja ) బ్లూ ఫిలింలలో నటించిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బండారు సత్యనారాయణని పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది.
అయితే ఈ గొడవపై మంత్రి రోజా కన్నీరు పెట్టుకోవడం జరిగింది.ఇదంతా పక్కన పెడితే బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను అప్పట్లో రోజాతో పాటు నటించిన హీరోయిన్స్ ఖండిస్తూ వస్తున్నారు.
తాజాగా నటి సీనియర్ హీరోయిన్ రాధిక.మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ( Bandaru Satyanarayana ) చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ఒక మహిళా బ్లూ ఫిలింలు చేసిందని చెప్పటమేంటని ప్రశ్నించారు.
మీరు బయటకు వెళ్తున్నారుగా మీ ఇంటిలో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని నిలదీశారు.
దేశంలో మహిళలు అన్నిరంగంలో రాణిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు.ఇది ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని రాధిక ( Radhika )స్పష్టం చేశారు.
ఇదే గొడవపై అంతకుముందు సీనియర్ నటి కుష్బూ కూడా స్పందించారు.మనిషిగా బండారు విఫలమయ్యారు.
వెంటనే రోజాకు బండారు సత్యనారాయణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ విషయంలో తాను రోజాకు సపోర్టుగా పోరాటం చేస్తానని కుష్బూ స్పష్టం చేశారు.







