Annapurnamma: కూతురి మరణాన్ని తలచుకొని ఎమోషనల్ అయిన అన్నపూర్ణ.. చివరి మాటలు ఇవేనంటూ? 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి అన్నపూర్ణమ్మ( Annapurnamma ) ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.

ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు పలు కార్యక్రమాలకు కూడా హాజరవుతుంటారు.

అయితే తాజాగా సుమ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి సుమ అడ్డా(Suma Adda)అనే కార్యక్రమానికి సీనియర్ సెలెబ్రెటీలు హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే అందరు కలిసి సుమతో ఎంతో సందడి చేశారు.

అయితే ఉన్నఫలంగా అన్నపూర్ణమ్మ తన కుమార్తె కీర్తిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

అన్నపూర్ణమ్మకు పిల్లలు లేకపోవడంతో చిన్నప్పుడే ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచారు.తనకు కీర్తి అని పేరు పెట్టారు.ఇలా తనని చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించారు.

Advertisement

బాగా తెలిసిన వారికే ఇచ్చి అన్నపూర్ణమ్మ తన కుమార్తె పెళ్లి చేశారు.అయితే పాప పుట్టిన తర్వాత తనకు మాటలు రాలేదు దీంతో థెరపీ కూడా చేయించిన లాభం లేకుండా పోయింది.

ఇలా తన కూతురి విషయంలో కీర్తి ఎంతో బెంగపెట్టుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంటూ ఈ సందర్భంగా తన కుమార్తెను( Annapurnamma Daughter ) తలుచుకొని అన్నపూర్ణమ్మ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఆరోజు కీర్తి (Keerthy) మా ఇంట్లోనే ఉంది నేను బజ్జీలు వేసుకొని వచ్చేలోపు అమ్మ నేను మా ఇంటికి వెళుతున్నాను మా అత్తగారు ఊరికి వెళ్తున్నారట అని నాతో చెప్పింది.మరి అత్తగారు ఊరికి వెళ్లేటప్పుడు ఇక్కడే పడుకో అని చెప్పగా లేదు మా ఆయన ఒక్కడే ఉంటారు నేను వెళ్తాను అమ్మ అని కేవలం రెండే రెండు బజ్జీలు తిని వెళ్లిపోయిందని తను అలా నవ్వుతూ అత్తారింటికి వెళ్తానమ్మ అని చెప్పినప్పుడు నాకు తాను చనిపోతుందని ఎలాంటి సందేహం రాలేదు.కానీ కొంతసేపటికే తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందనే వార్త వినాల్సి వచ్చింది అంటూ ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ ఎమోషనల్ అయ్యారు.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు