ప్రభాస్ తో ఫొటో తీసుకునేందుకు మోడీ వెయిటింగ్.. హీరో పెద్దమ్మ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజను పైగా సినిమాలు ఉన్నాయి.కొత్త సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు ప్రభాస్.

ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్.ఇక బాహుబలి సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్టార్ పూర్తిగా మారిపోయింది.ఇకపోతే తెలుగు సినీ ప్రేక్షకులు జీవితాంతం గుర్తుంచుకునే సినిమాలలో బాహుబలి సినిమా కూడా ఒకటి.

Advertisement

బాహుబలి సినిమా తరువాత ఏ సినిమా ప్రస్తావన వచ్చినా కూడా బాహుబలి సినిమా కంటే ఎక్కువ.బాహుబలి సినిమా కంటే తక్కువ అని మాట్లాడుతున్నారు అంటే బాహుబలి సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

దర్శకుడు రాజమౌళి కూడా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాడు.ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఒక రకమైన చూపు చూసే వారికి నోటి మీద వేలు వేసుకునేలా చేశాడు దర్శకుడు రాజమౌళి.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ పెద్దమ్మ, రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామల దేవి ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించింది.ఈ సందర్భంగా శ్యామలాదేవి మాట్లాడుతూ.

బాహుబలి సినిమా ఇండస్ట్రీ లెక్కల్ని మార్చేసిందని, తెలుగు సినిమా సాయి చిరస్థాయి అని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బాహుబలి బాహుబలి అని అంటారు అని చెప్పుకొచ్చింది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

అదే విధంగా తాను కృష్ణంరాజు నార్త్ సైడ్ వెళితే అక్కడ అందరూ బాహుబలి పెద్దమ్మ బాహుబలి పెద్దనాన్న అని అంటారు అని తెలిపింది శ్యామల దేవి.అంతేకాకుండా ప్రభాస్ గురించి సెంట్రల్ మినిస్టర్ సైతం అడుగుతూ ఉంటారు.మా వాడు మీ అబ్బాయికి పెద్ద ఫ్యాన్ ఎప్పుడు ఫోటో తీసుకునే అవకాశం ఇస్తారని అడుగుతూ ఉంటారు అని తెలిపింది.

Advertisement

అంతేకాకుండా చాలా మంది ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపించి ప్రభాస్ తో ఫోటో తీయించుకోవడానికి అపాయింట్ మెంట్ తీసుకునేవారు అని తెలిపింది.అలాగే నితిన్ గట్కారీ గారికి ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, ప్రభాస్ షూటింగ్ కోసం ముంబై కి వెళ్ళగా అక్కడికి వెళ్లి మరి ప్రభాస్ తో ఫోటో దిగి వెళ్లారని చెప్పుకొచ్చింది శ్యామల దేవి.

అంతేకాకుండా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయితే బాహుబలి ఎలా ఉన్నారు అని అడుగుతారని, ప్రభాస్ అంటే నరేంద్రమోడి చాలా ఇష్టమని, కృష్ణం రాజు గారిని పదేపదే ఆ మాట అడుగుతూ ఉంటారని అలా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రభాస్ అంటే ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు అంటూ ప్రభాస్ ఫై ప్రశంసల వర్షం కురిపించింది బాహుబలి పెద్దమ్మ శ్యామల దేవి.

తాజా వార్తలు