నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.సమ్మర్‌లో విడుదల అవ్వడం ఖాయం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కరోనా వైరస్ విజృంభించి సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
ప్రస్తుతం సినిమాకు చెందిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.ఆగస్టులో సినిమా మిగిలిన బ్యాలన్స్ షూటింగ్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రంను మరో ఫిదా రేంజ్‌లో తెరకెక్కించి ఉంటాడని అంతా నమ్ముతున్నారు.
శేఖర్ కమ్ములకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉంది.
ఆయన దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను రాబట్టాయి.ముఖ్యంగా ఫిదా చిత్రం అక్కడ స్టార్ హీరోల సినిమాల స్థాయిలో వసూళ్లు రాబట్టి ఆల్ టైం టాప్ చిత్రాల జాబితాలో నిలిచింది.
అందుకే ఓవర్సీస్‌లో లవ్ స్టోరీ చిత్రాన్ని కూడా భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు బయ్యర్లు రెడీగా ఉన్నారు.

ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో అమెరికాతో పాటు అన్ని దేశాల్లో కూడా పరిస్థితులు చాలా ఇబ్బంది కరంగా ఉన్నాయి.థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వడం లేదు.అందుకే లవ్ స్టోరీ సినిమాను అమెరికాలో పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ అయినప్పుడు మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
ఒక వేళ అక్కడ పరిస్థితులు చక్కదిద్దుకోక ముందే విడుదల అయితే కనీసం అయిదు కోట్ల నష్టం తప్పదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.