అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత.

కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట మూలవాగు నుండి ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నరనే సమాచారం మేరకు ఎస్సై తమ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి టి ఎస్ -02-ఈ ఏ -5627 నెంబర్ గల ట్రాక్టర్ ను తనిఖీ చేయగా ఇసుకకు సంబంధించిన ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవని, ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించి డ్రైవర్ పిట్టల గంగాధర్, ట్రాక్టర్ ఓనర్ చొక్కల దేవరాజు లపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన కోనరావుపేట ఎస్సై రమాకాంత్.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నవారు రెండవ సారి పట్టుబడితే తహసిల్దార్ ముందు బైండోవర్ చేయబడుతుందని అలాగే మూడవ సారి పట్టుబడితే వారి ట్రాక్టర్ ని జప్తు చేయబడుతుందని కోనరావుపేట ఎస్ఐ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Seized Of Tractor Transporting Sand Illegally ,,tractor ,seized , Rajannasirisil

Latest Latest News - Telugu News