కాస్టింగ్ కౌచ్ పై శర్వానంద్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో గడిచిన రెండేళ్ల నుంచి కాస్టింగ్ కౌచ్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.టాలీవుడ్ నటీమణుల్లోనే క్యాస్టింగ్ కౌచ్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు నటీమణులు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెబుతుంటే మరి కొందరు మాత్రం తమకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయని కానీ పేర్లను వెల్లడించలేమని చెబుతూ ఉంటారు.తాజాగా మరో హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది.

శర్వానంద్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది సీరత్ కపూర్.తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో సీరత్ కు వరుస గా ఆఫర్లు వచ్చాయి.

రాజు గారి గది2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం సినిమాలతో సీరత్ కు మంచి గుర్తింపు వచ్చింది.ప్రస్తుతం ఈ ముంబై బ్యూటీ కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా సినిమాల్లో నటిస్తోంది.

Advertisement

సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ అంశం గురించి సీరత్ కపూర్ స్పందించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ప్రతిచోటా కాస్టింగ్ కౌచ్ ఉంటుందని.

కాస్టింగ్ కౌచ్ జరిగిందని అరవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సీరత్ పేర్కొంది.కాస్టింగ్ కౌచ్ ఎదురైతే ఆ సమస్య నుంచి ఎలా బయటపడగలమో ఆలోచించాలని చెప్పింది.

ఎవరైనా గట్టిగా అరుస్తూ కేకలు వేస్తే వాళ్లే చివరకు అల్లరిపాలు కావాల్సి వస్తుందని తెలిపింది.కాస్టింగ్ కౌచ్ అనుభవం నుంచి ఏం నేర్చుకున్నాం అనేది ఇండస్ట్రీలో చాలా ముఖ్యమని వెల్లడించింది.

కాస్టింగ్ కౌచ్ బారిన ఎలా పడ్డామనే విషయాలను, ఎలా తప్పించుకున్నామనే విషయాలను చెబితే బాగుంటుందని పేర్కొంది.సీరత్ చేసిన వ్యాఖ్యల్లో నిజమే ఉంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

కాస్టింగ్ కౌచ్ అంటూ ఆరోపణలు చేయడం కంటే కాస్టింగ్ కౌచ్ బారిన ఎలా పడ్డారో చెబితే ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లతో పాటు కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టే వాళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు