అందమైన ఆడది తలుచుకుంటే ఎంత పని చేయగలదో చూడండి!

మీకు అందమైన మగువ కనిపించిందా? మీతో చనువుగా ఉండేందుకు ప్రయత్నిస్తుందా? ఖరీదైన హోటల్స్, రిసార్ట్స్‌కు పోదామని ఆశ పెడుతుందా? ప్రయివేటుగా కలుద్దామని చెబుతందా? అప్పుడే ఆశ పడకండి.

అందాన్ని ఎరగా వేసే మహిళల మాయలో పడిపోకండి.

ఎందుకంటే.తన అందాన్ని ఎరగా వేసి నిలువునా మోసం చేసే అవకాశం ఉంది.

ఆమె మాటలు, అందం మీకు థ్రిల్లింగ్‌గా అనిపించినా సరే.ఒక్కసారి ఆలోచించి ముందడుగు వేయండి.భార్యభర్తలిద్దరూ కలిసి ఓ వ్యక్తిని కోట్లలో మోసం చేసిన ఘటన ఇది.

కనిష్క, విజయ్ కుమార్ అనే ఇద్దరు భార్యాభర్తలు.అయితే వీరిది ప్రేమ వివాహం.కనిష్క ఎయిర్‌హోస్టెస్ కాగా, విజయ్ కుమార్ వీ హోటల్స్ పేరుతో వ్యాపారం చేసేవాడు.

Advertisement

హోటల్ వ్యాపారంలో విజయ్ 2 కోట్ల మేర నష్టపోవడంతో ఆ అప్పులు తీర్చేందుకు వలపు వల, బెదిరింపుల మార్గాన్ని ఎంచుకున్నారు.ఇదే సమయంలో ఓ పాస్టర్ ఈ దంపతుల కంట పడ్డాడు.

అతని అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బెదిరింపులకు పాల్పడి లక్షల్లో నగదు దోచుకున్నారు.ఆ బెదిరింపు కూడా తియ్యని మాటలతో.

అందాన్ని అడ్డం పెట్టుకుని చేసిందావిడ.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ చర్చిలో 58 ఏళ్ల వ్యక్తి పాస్టర్‌గా పని చేస్తున్నాడు.

రెండు నెలల క్రితం కనిష్క.ఆ పాస్టర్‌ను కలిసి తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ప్రార్థన చేయాలని కోరింది.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
పరీక్షకు నిమిషాల ముందు షాక్.. హాల్ టికెట్ తన్నుకుపోయిన గద్ద.. చివరి క్షణంలో ఏమైందంటే..?

మళ్లీ తన కోసం ప్రార్థన చేయాలని ఫోన్ చేసి అడిగింది.వీరిద్దరూ సికింద్రాబాద్‌లోని చర్చిలో కలిసి ప్రార్థనలు చేశారు.

Advertisement

పాస్టర్, కనిష్క మధ్య సాన్నిహిత్యం కూడా పెరిగింది.మొత్తానికి తన వలపులో వేసుకున్న కనిష్క.

పాస్టర్‌ను మోసం చేయాలని నిశ్చయించుకుంది.

ఇక తనకు కోటిన్నర విలువైన కేఎఫ్‌సీ కాంట్రాక్ట్ వచ్చిందని పాస్టర్‌తో నమ్మబలికి 10 లక్షల రూపాయాలు కాజేసింది.కేఎఫ్‌సీతో ఒప్పందం కుదుర్చునేందుకు శంకర్‌పల్లిలోని ఓ రిసార్ట్‌కు రావాలని కనిష్క.పాస్టర్‌కు చెప్పింది.

అక్కడే అసలు ఆట మొదలైంది.రిసార్ట్‌కు వెళ్లిన పాస్టర్‌కు మత్తుమందు కలిపిన ఆపిల్ జ్యూస్ ఇచ్చింది కనిష్క.

పాస్టర్ సృ్పహ కోల్పోయాడు.సీన్ కట్ చేస్తే.

మరుసటి రోజు 4 గంటలకు పాస్టర్‌కు మెలకువ వచ్చింది.హాల్‌లో ఉన్న అతను బాత్‌టబ్‌లో ఉన్నాడు.

అంతలోపే విజయ్ వచ్చి పాస్టర్‌పై గన్‌తో గురిపెట్టాడు.పాస్టర్ ఈ దంపతులకు కోటి రూపాయాలు అప్పు ఉన్నట్లు బాండు పేపర్లపై సంతకం చేయించుకున్నాడు విజయ్.

అంతటితో ఆగకుండా కొన్ని ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడంతో పాస్టర్ మరో 10 లక్షల రూపాయాలు ఇచ్చాడు.ఇలా పాస్టర్‌ను బెదిరిస్తూ వస్తూ అతడి వద్ద నుంచి బాగానే డబ్బులు వసూలు చేశారు.

కనిష్క, విజయ్ దంపతుల ఆగడాలు భరించలేని పాస్టర్.పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కిలాడీ దంపతులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ఇలాంటి మాయలు చేసే దంపతులకు దూరంగా ఉండడం మంచిది.

మగువ అందాలు చూసి మోసపోకండి.వారి మాటలకు ముగ్ధులు కాకండి.

తాజా వార్తలు