కరాటే అక్క సర్దేసుకునే టైం వచ్చినట్లేనా?

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 మొదటి వారంలో సూర్య కిరణ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు.

ఆయన ఎలిమినేషన్‌ తర్వాత ఆయన మాట్లాడింది నిజమే కదా అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నా అప్పటికే జరగాల్సింది జరిగి పోయింది.

ఇక మొదటి వారంలో ఎలిమినేషన్‌ లో ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్‌ అయ్యేది అంటూ కరాటే కళ్యాణి గురించి ప్రచారం జరిగింది.ఆ వారంలో ఆమె సేఫ్‌ అయ్యింది.

ఇప్పుడు ఆమె రెండవ వారంలో నామినేట్‌ అయ్యింది.ఎలిమినేషన్‌ కు వచ్చిన ఆమెను జనాలు పట్టించుకోలేదు అంటూ తెలుస్తోంది.

రేపు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ లో కరాటే కళ్యాణిని ఎలిమినేట్‌ చేసే అవకాశం ఉంది అంటున్నారు.అతి తక్కువ ఓట్లు రావడంతో పాటు ప్రతి దానికి కూడా ఆమె సీరియస్‌ అవ్వడం లేదంటే ఏడ్చేయడం పావలకు రూపాయి యాక్టింగ్‌ చేయడం వంటివి చేయడం వల్ల ఆమెకు ఈ వారంలో ఎలిమినేషన్‌ తప్పేలా లేదు.

Advertisement

ఆమె కాకుండా కుమార్‌ సాయి మరియు అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ లు తక్కువ ఓట్లు పొందినట్లుగా సమాచారం అందుతోంది.కరాటే కళ్యాణి కాకుండా మరెవ్వరు అయినా ఎలిమినేట్‌ అవుతారు అంటే అది కుమార్‌ సాయి లేదా అమ్మ రాజశేఖర్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.

వైల్డ్‌ ఎంట్రీ ఇచ్చిన కుమార్‌ సాయి అందులో సభ్యులతో కలవలేక పోయాడు.దాంతో ప్రేక్షకులు అతడిని పెద్దగా పట్టించుకోలేదు.

ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపించలేదు అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.అసలు విషయం ఏంటీ అనేది మరి కొన్ని గంటల్లో తెలిసి పోతుంది.

మొత్తం 9 మంది ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయితే అందులో ముగ్గురు లేదా నలుగురిని సేవ్‌ చేసే అవకాశం ఉంది.రేపటి ఎపిసోడ్‌ కూడా నేడే షూటింగ్‌ జరుగుతుంది కనుక రేపు ఉదయం వరకు ఎవరు ఎలిమినేట్‌ అయ్యారు అనే విషయం లీక్‌ అవ్వనుంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీకి ఆ టైటిల్ ను ఫిక్స్ చేయడం కష్టమే.. ఆ కష్టాన్ని అధిగమిస్తారా?
ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. తారక్ ను చూడాలని 300 కిలోమీటర్లు నడిచాడా?

గంగవ్వ ఉండాలి అనుకుంటే ఆమెను ఉంచుతారు.లేదు అంటే ఆమెను బయటకు తీసుకు వచ్చేందుకు నిర్వాహకులు సిద్దంగా ఉన్నారట.

Advertisement

గంగవ్వ బయటకు వస్తే కళ్యాణి ఒక్కరు మాత్రమే ఎలిమినేషన్‌.గంగవ్వ ఉండాలని అనుకుంటే కళ్యాణితో పాటు కుమార్‌ సాయి లేదా అమ్మ రాజశేఖర్‌ ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది అనిపిస్తుంది.

తాజా వార్తలు