భార్య జాబ్ కొట్టేందుకు రేయింబవళ్లు కష్టపడిన భర్త.. చివరికి భార్య ఏం చేసిందంటే..?

ఇటీవలే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకుంటామంటే తల్లిదండ్రులు( Parents ) రేయింబవళ్లు ఎంత కష్టపడి చదివిస్తారో అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో ఓ యువతికి ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అనే కోరిక ఉండేది.

 Sdm Jyoti Maurya Accused Of Cheating Her Husband And Corruption,sdm Jyoti Maurya-TeluguStop.com

కానీ వివాహం తర్వాత భర్త ఆ యువతి మనసును అర్థం చేసుకొని చదివించేందుకు రేయింబవళ్లు కష్టపడ్డాడు.ఇంత కష్టపడి చదివించిన భర్తకు ఆ యువతి ఉద్యోగం వచ్చాక ఊహించని షాక్ ఇచ్చింది.

ఈ దారుణమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.

వివరాల్లోకెళితే.ఉత్తర ప్రదేశ్( Uttar Pradesh ) లో అలోక్ మౌర్య, జ్యోతి మౌర్య లకు వివాహం అయ్యింది.ఇరువురి కుటుంబాలు మధ్య తరగతికి చెందడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నారు.

భర్త అలోక్( Alok Maurya ) రేయింబవళ్లు కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.అయితే జ్యోతి తనకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అనే కళ ఉందని భర్త అలోక్ కు చెప్పింది.

భర్త చేసే ఉద్యోగం కుటుంబ పోషణకే సరిపోదు అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కోచింగ్లు, పుస్తకాలు లాంటివి ఎన్నో కావాలి.

అయితే భార్య కలను తన కలలా భావించిన అలోక్ ఆమెను ప్రభుత్వ ఉద్యోగం సాధించే దిశగా ప్రోత్సహించి అందుకోసం రేయింబవళ్లు కష్టపడుతూ ప్రయాగ్ రాజ్ లోని ఓ మంచి కోచింగ్ సెంటర్లో చేర్పించి, భార్యకు ఏ లోటు లేకుండా తన వంతు సహకారం అందించాడు.

జ్యోతి కూడా తన భర్త కష్టాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్( SDM ) ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.ఇంతవరకు బాగానే ఉంది.కానీ తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అనే సంతోషం అలోక్ కు ఎక్కువ రోజులు నిలువలేదు. ప్రభుత్వ ఉద్యోగం( Government Job ) వచ్చిన తర్వాత జ్యోతి తనపై అధికారితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఈ విషయంలో భార్యను అలోక్ ఎంతగానో నచ్చచెప్పినా జ్యోతి( Jyoti Maurya ) తన ప్రవర్తన మార్చుకోకుండా తిరిగి తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి అరెస్టు కూడా చేయించింది.

తాజాగా అలోక్ బెయిల్ పై బయటకు వచ్చి ఉన్న ఉద్యోగం పోవడంతో, ఉపాధి దొరకక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు.

పైగా తనను తన భార్యతో పాటు ఆ ఆఫీసర్ కూడా బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని అలోక్ కోరుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube