రాజకీయ ఆరంగేట్రం చేసిన షాయాజీ షిండే.. ఆ పార్టీలో సక్సెస్ సాధిస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా తన నటనతో షాయాజీ షిండే( Sayaji Shinde ) ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

షాయాజీ షిండే కొన్నేళ్ల క్రితం వరకు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నా ప్రస్తుతం ఆయన చేతిలో ఎక్కువ సంఖ్యలో మూవీ ఆఫర్లు అయితే లేవనే సంగతి తెలిసిందే.

తాజాగా షాయాజీ షిండే రాజకీయ ఆరంగేట్రం చేశారు.అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( Congress party)లో ఆయన చేరారు.

ముంబైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్( Ajit Pawar) షాయాజీ షిండేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా ఈ ఎన్నికల్లో షాయాజీ షిండే పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని సమాచారం అందుతోంది.షాయాజీ షిండేకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని అజిత్ పవార్ పేర్కొన్నారు.

తమ పార్టీ తరపున షాయాజీ షిండే స్టార్ క్యాంపెయినర్ గా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు.షాయాజీ షిండే మాట్లాడుతూ తాను చాలా సినిమాలలో పొలిటీషియన్ గా నటించానని తెలిపారు.అజిత్ పవార్ నడవడిక నన్ను ఆకర్షించిందని ఆయన కామెంట్లు చేశారు.

Advertisement

మరింత సమర్థవంతంగా పని చేసేందుకు పార్టీలో చేరానని ఆయన పేర్కొన్నారు.మొక్కలు నాటే కార్యక్రమం గురించి గురించి పవార్ తో చెప్పిన విషయాలను ఈ సందర్భంగా షాయాజీ షిండే గుర్తు చేసుకున్నారు.

మహారాష్ట్రలో రైతు కుటుంబంలో జన్మించిన షాయాజీ షిండే కొన్నాళ్ల పాటు వాచ్ మేన్ గా కూడా పని చేశారు.తెలుగులో ఠాగూర్, అతడు, పోకిరి సినిమాలు షాయాజీ షిండేకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

షాయాజీ షిండే కెరీర్ పరంగా మరింత ఎదగాలని మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

ధనవంతులకు ఆ బ్రిటీష్ యూనివర్సిటీ స్ట్రాంగ్ వార్నింగ్..?
Advertisement

తాజా వార్తలు