వింటర్ లో ఈ ఫ్రూట్ మాస్క్ ను ట్రై చేస్తే డ్రై స్కిన్ కు గుడ్ బై చెప్పవచ్చు!

చలికాలంలో( Winter ) దాదాపు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే కామన్ సమస్య డ్రై స్కిన్.

( Dry Skin ) చర్మం ఎంత తెల్లగా ఉన్నా సరే పొడిబారడం వల్ల కాంతిహీనంగా కనిపిస్తుంది.

పైగా పొడి చర్మం వల్ల దురద, చికాకు వంటివి కూడా అధికంగానే ఉంటాయి.అందుకే డ్రై స్కిన్ సమస్యను నివారించుకోవడం కోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే ఫ్రూట్ మాస్క్( Fruit Mask ) చాలా అద్భుతంగా సహాయపడుతుంది.వింటర్ లో ఈ ఫ్రూట్ మాస్క్ ను ట్రై చేస్తే డ్రై స్కిన్ కు గుడ్ బై చెప్పవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫ్రూట్ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.అవకాడో( Avocado ) ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.

Advertisement

అవకాడోలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ చర్మాన్ని తేమగా మారుస్తాయి.అలాగే విటమిన్ ఈ మరియు విటమిన్ సి వంటి పోషకాలు చర్మానికి పునరుజ్జీవనం కలిగిస్తాయి.

అవకాడోను చర్మానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా బాగా పండిన ఒక అవకాడో పండును తీసుకుని గింజ తొలగించి లోపల ఉండే ప‌ల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ పల్ప్ ను మిక్సీ జార్ లో వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ అవకాడో పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్,( Oats Powder ) వన్ టేబుల్ స్పూన్ పెరుగు,( Curd ) వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ అండ్ వండర్ ఫుల్ ఫ్రూట్ మాస్క్ ను వేసుకుంటే డ్రై స్కిన్ అన్న మాటే అనరు.ఎల్లప్పుడూ చర్మం తేమగా, కోమలంగా ఉంటుంది.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

అలాగే చర్మ ఛాయ మెరుగుపడుతుంది.స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా సైతం మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు