మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో బాగా గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా ఎస్టాబ్లిష్ అయిన సత్యదేవ్ కి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మంచి ఇమేజ్ వచ్చేసింది.
ఈ సినిమా సాధారణ ప్రేక్షకులని మెప్పించడంతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.తనలో ఎంత మంచి నటుడు ఉన్నాడో అనే విషయాన్ని అందరికి అర్ధమయ్యేలా చేసింది.
అందరికంటే ముందుగా జ్యోతిలక్ష్మి సినిమాతో సత్యదేవ్ లోని నటుడుని పూరి గుర్తించి హీరోగా అవకాశం ఇచ్చాడు.ఆ సినిమా క్రెడిట్ మొత్తం ఛార్మి ఖాతాలోకి వెళ్లిపోవడంతో సత్యదేవ్ నటన ఎవరికీ పెద్దగా కనిపించలేదు.
అయితే ఇప్పుడు మాత్రం సత్యదేవ్ ఫుల్ బిజీ హీరోగా మారిపోయాడు.ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
మరో వైపు ఈ ఏడాది ఎక్కువ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన హీరో ఎవరంటే సత్యదేవ్ అని చెప్పాలి.ఈ ఏడాది ఓటీటీ ద్వారా అతని సినిమాలు ఇప్పటికే మూడు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.మూడు సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.ఇప్పుడు మరో సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెలలో ఒక సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.
గువ్వా గోరింక అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సినిమాలో సత్యదేవ్ నటించాడు.ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ ప్రారంభమైందో, ఎప్పుడు పూర్తయ్యిందో అనేది ఎవరికీ తెలియదు.కానీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుపుకొని ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.సత్యదేవ్ ఇమేజ్ కారణంగా ఇప్పుడు ఈ సినిమాకి హైప్ వచ్చింది.
ఈ ఏడాది సత్యదేవ్ నుంచి వస్తున్న నాలుగో సినిమా ఇది కావడం విశేషం.