వివాహ భోజనంబు.. మొత్తం సినిమా ఇంట్లోనే తీశారుగా..!

స్వామిరారా సినిమాతో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సత్య లీడ్ రోల్ లో సందీప్ కిషన్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన సినిమా వివాహ భోజనంబు.సోనీ లివ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజైన ఈ సినిమా కరోనా నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చింది.

పిసినారి మహేష్ పాత్రలో సత్య.అతను ప్రేమించిన అమ్మాయి ఫ్యామిలీని మోసం చేసి పెళ్లి చేసుకుంటాడు.

ఆ టైం లోనే కరోనా విజృంభించడం.లాక్ డౌన్ వంటి అంశాలతో కామెడీగా తెరకెక్కించారు.

సినిమా చూస్తున్నంత సేపు జస్ట్ ఓకే అనిపిస్తుంది.అయితే పెళ్లి చేసేందుకు 100 అబద్ధాలు ఆడినా పర్వాలేదు అంటారు కాని సినిమాలో మొదటి నుండి చివరి వరకు హీరోయిన్ ఫ్యామిలీని బకరా చేస్తాడు హీరో.

Advertisement

ఇది అంతగా మెప్పించలేదు.ఇక హీరో సత్యని హీరోయిన్ ఏం చేసి పడిపోయింది అన్నది కూడా అర్ధం కాదు.

ఇలా కొన్ని కొన్ని అంశాలు సినిమా మీద నెగటివ్ ఇంప్యాక్ట్ ఏర్పడేలా చేస్తాయి.అంతేకాదు సినిమా మొత్తం ఒక ఇంట్లోనే షూట్ చేశారు.

బడ్జెట్ కూడా చాలా తక్కువ అయ్యుంటుందని చెప్పొచ్చు.నిర్మాత సందీప్ కిషన్ కూడా సినిమాలో గెస్ట్ రోల్ చేసి మెప్పించాడు.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు