మొక్కను తిన్న మేక, శిక్ష అనుభవించిన యజమాని

మేక మొక్కను తింటే యజమానికి శిక్ష విధించడం ఏంటి అని అనుకుంటున్నారా.మొక్కలను తినడం సాధారణమైన విషయం.

అలాంటి మేక మొక్కను తినింది అని దాని యజమాని కి శిక్ష విధించారు.అయితే ఇంతకీ మేక తిన్న మొక్క ఏమిటంటే హరిత హారం లో భాగంగా ప్రజా ప్రతినిధులు నాటినది కావడమే అసలు కారణం.

హరితహారంలో భాగంగా నాటిన మొక్కను మేక కడుపారా తిన్నది దీనితో ఆ మేక యజమాని అయిన అవ్వ కి ఆ ఊరి సర్పంచ్ శిక్ష విధించారు.ఆ శిక్ష కూడా విచిత్రంగానే ఉంది.

మేక చేసిన తప్పుకు ఆ అవ్వకు ఇరవై మొక్కలు నాటాలి అంటూ సర్పంచ్ ఆదేశించారు.వాళ్లు చెప్పినట్టుగానే అవ్వ ఆ ఇరవై మొక్కలు నాటింది కూడా.

Advertisement

అక్కడితో ఆగక ఇక నుంచి వాటి సంరక్షణ బాధ్యత తానే చూసుకుంటాని చెబుతోంది.వికారాబాద్ జిల్లా బార్వాద్ గ్రామంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

మొత్తానికి నోరు లేని జీవి చేసిన తప్పు కు యజమాని శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు