సరిలేరు నీకెవ్వరు 18 రోజలు కలెక్షన్లు.. ఎంతంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన మార్క్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిచడంతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది.

మహేష్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడంతో ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరారు.సంక్రాంతి బరిలో పోటీగా అల వైకుంఠపురములో సినిమా ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంపరను కొనసాగించడంలో సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంది ఈ సినిమా.

ఇక మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా అవతరించింది.లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగి థియేటర్ల వరకు వారిని లాగింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి 18 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.132.57 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది.మాస్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిన ఈ సినిమా, కలెక్షన్ల పరంగా కాస్త డీలా పడింది.

మరి టోటల్ రన్‌లో ఈ సినిమా ఎంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 18 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 37.38 కోట్లు సీడెడ్ - 15.06 కోట్లు గుంటూరు - 9.58 కోట్లు ఉత్తరాంధ్ర - 18.91 కోట్లు ఈస్ట్ - 10.94 కోట్లు వెస్ట్ - 7.20 కోట్లు కృష్ణా - 8.56 కోట్లు నెల్లూరు - 3.88 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 111.51 కోట్లు కర్ణాటక - 7.39 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 1.81 కోట్లు ఓవర్సీస్ - 11.86 కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ - 132.57 కోట్లు.

Advertisement
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

తాజా వార్తలు