ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అత్యత్తమ ఆట ప్రదర్శన కనపరిచి బెస్ట్ ఉమెన్ క్రికెటర్ల లో టాప్ ప్లేస్ లో నిలుస్తున్నారు.వికెట్ కీపింగ్ విషయానికి వస్తే ఆమె మహేంద్ర సింగ్ ధోనీ లాగా చాలా వేగంగా బంతిని క్యాచ్ పట్టుకుంటూ స్టంప్ అవుట్స్ చేయగలరు.
అయితే ఆమె తొలిసారి ఒక పురుషులు జట్టుకు వికెట్ కీపింగ్ కోచ్‌గా ఎంపికయ్యారు.ఇంగ్లండ్ లోని దేశవాలీ జట్టు అయిన “ససెక్స్” కు టేలర్ కోచ్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు.
అనగా ఆమె ససెక్స్ టీమ్ ప్లేయర్స్ కి వికెట్ కీపింగ్ లో కోచింగ్ ఇవ్వనున్నారు.ప్రస్తుత క్రికెట్ రంగంలో పురుషులతో సరిసమానంగా ఆట ఆడుతూ బెస్ట్ క్రికెటర్ గా ఆమె పేరు తెచ్చుకున్నారు.క్రికెట్ క్రీడా రంగంలో పురుషులకు ఒక మహిళ కోచింగ్ ఇవ్వటం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
”ససెక్స్ జట్టుకు వికెట్ కీపింగ్ కోచ్ గా పని చేయడం నాకు సంతోషంగా ఉంది.ఈ టీమ్ లో చాలా టాలెంటెడ్ క్రికెటర్లు ఉన్నారు.వారితో పనిచేయడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.నా అనుభవం.నైపుణ్యాలను వారికి నూరిపోసి వారి జట్టును విజయతీరాలకు వైపు నడిపించడంలో నా వంతు కృషి చేస్తాను.
వికెట్ కీపింగ్‌లోని బేసిక్ టిప్స్ పై ఎక్కువగా దృష్టి సారించి ఆటగాళ్లకు మెళుకువలు నేర్పించేందుకు ప్రయత్నిస్తాను.వారితో జాలిగా ఉండి కోచ్, శిష్యుల మధ్య ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాను ” అంటూ ఆమె చెప్పుకొచ్చారు.