నేను సివిల్స్ కు ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. కాంతార బ్యూటీ కామెంట్స్ వైరల్!

సప్తమి గౌడ.( Sapthami Gowda ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమాతో( Kantara ) దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.ఈ చిత్రంలో లీల పాత్రలో అద్భుతంగా నటించిన సప్తమి గౌడకు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి.

ఇకపోతే సప్తమి గౌడ ప్రస్తుతం వ్యాక్సిన్‌ వార్‌, యువ, కాళి, కాంతార ప్రీక్వెల్‌ తదితర చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఆమె హీరో నితిన్‌ సరసన తమ్ముడు సినిమాలో కూడా ఛాన్స్‌ దక్కించుకుంది.ఈ సినిమా కోసం ఆమె గుర్రపు స్వారీ కూడ నేర్చుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా యూపీఎస్సీ( UPSC ) ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Advertisement

బెంగళూరులో సివిల్‌ ఇంజనీరింగ్‌( Civil Engineering ) చదవును పూర్తి చేసిన సప్తమి గౌడకు మొదట యూపీఎస్సీ సాధించి పోలీస్‌ శాఖలో రాణించాలని కోరిక ఉండేదట.అందుకు గల ప్రధాన కారణం తన తండ్రి కర్ణాటక పోలీస్‌ శాఖలో ఉన్నత అధికారిగా ఉండటమేనని ఆమె తెలిపింది.మా నాన్న మాదిరి పోలీస్‌ విభాగంలో( Police Department ) ఉండాలని నాకు ఆశ ఉండేది.

దాంతో నా చిన్నతనం నుంచే చదువులోనూ, క్రీడల్లోనూ రాణించాను.చదువులో చాలా ముందు ఉండేదాన్ని.

నేను యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే, గ్యారెంటీగా పాస్ అయ్యేదానిని.కానీ, ఇప్పుడు అది సాధ్యం కాదు.

దానికి చాలా ఫోకస్ కావాలి.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

అనుకోకుండా నటిని అయ్యాను అని ఆమె తెలిపింది.ఐదేళ్ల వయసులోనే సప్తమి గౌడ ఈత శిక్షణ పొందింది.2006 నుంచి 2010 వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న సప్తమి గౌడ ఎన్నో రజత, కాంస్య, బంగారు పతకాలను కూడా కైవసం చేసుకుంది.సప్తమి గౌడ 2020లో విడుదలైన దునియా సూరి పాప్‌కార్న్ మంకీ టైగర్ చిత్రంతో తన నటనను ప్రారంభించింది.

Advertisement

దీనికిగాను 2021లో ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును కూడా గెలుచుకుంది.కాగా కాంతార చిత్రం తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఆమె సత్తా చాటుతోంది.

తాజా వార్తలు