బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి( Minister Komatireddy ) తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని , తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు.
కెసిఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూనే .తాము అర్బకులం కాదు అర్జునులమై పోరాడుతాం అంటూ వెంకటరెడ్డి అన్నారు.
కాంగ్రెస్ అమలు చేసే హామీలే ఇచ్చింది అంటూ ఆయన అన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 12 ఎంపీ స్థానాలు వస్తాయని, బీఆర్ఎస్( BRS ) కు 8 స్థానాలు వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను.కెసిఆర్ ఏం చేస్తారో చెప్పాలని వెంకటరెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు బీసీఆర్ఎస్ లోకి వస్తారని కెసిఆర్ అంటున్నారని , ఆ పాతికమంది ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలదీశారు.
తాను కాంగ్రెస్( Congress ) లోకి వచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు చెబుతానని సవాల్ చేశారు.
లిక్కర్ స్కాం పై కెసిఆర్ తెలిసే మాట్లాడుతున్నారా ? ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha )ఏ ముత్యమో త్వరలో తేలుతుందని అన్నారు.సీఎం అయినా ఎమ్మెల్సీ అయినా తప్పు చేస్తే జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు.నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయి.
ఇది కూడా కేసీఆర్ కు తెలియదా ? ఫోన్ ట్యాపింగ్ బాధ్యత అప్పటి ప్రభుత్వం పై ఉందని వెంకటరెడ్డి అన్నారుఓ ప్రైవేట్ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో పాల్గొన్న కెసిఆర్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు చేయడం, కెసిఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని కెసిఆర్ పేరును చెరపడం ఎవరివల్లా సాధ్యం కాదని, కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని ,ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని చేసిన వ్యాఖ్యల వెంకటరెడ్డి ఈ విధంగా విమర్శలు చేస్తూ.సవాళ్లు చేశారు.