ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర చివరి రోజు కొనసాగుతోంది.ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా అక్కివలసలో ప్రారంభమైన యాత్ర ప్రస్తుతం నరసన్నపేట నియోజకవర్గంలో సాగుతోంది.
మరి కాసేపటిలో టెక్కలి నియోజకవర్గం( Tekkali )లోని అక్కవరంకు సీఎం జగన్ బస్సు యాత్ర చేరుకోనుంది.ఈ నేపథ్యంలో అక్కవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు.
కాగా ఇప్పటికే సభా ప్రాంగణానికి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు.అక్కవరం సభ ముగిసిన వెంటనే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి తిరిగి పయనం కానున్నారు.
త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మొదటి విడత ప్రచారంలో భాగంగా జగన్ బస్సు యాత్రను చేపట్టారు.మొత్తం 22 రోజుల్లో 22 జిల్లాలను సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది.
కాగా ఈ యాత్రలో సీఎం జగన్ కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.







