అన్నీ మంచి శకునములే టీజర్.. సింప్లీ సూపర్..!

సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా అన్నీ మంచిశకునములే.ఈ సినిమాకు సంబందించిన టీజర్ రీసెంట్ గా రిలీజైంది.

ఈ టీజర్ చూస్తే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది.ఓ పక్క గొప్ప ఆస్థిపరుడైన హీరో మరోపక్క రెండు విభిన్న పాత్రలుగా కనిపిస్తున్న హీరోయిన్ ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏం జరిగింది అన్నది సినిమా కథ.టీజర్ చూస్తే సినిమా అంతా ఆహ్లాదకరంగా ఉండేలా అనిపిస్తుంది.అలా మొదలైంది నుంచి ఓ బేబీ వరకు తను తీసే ప్రతి సినిమా మంచి ఎమోషనల్ రైడ్ గా తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ సినిమాను కూడా అదే రేంజ్ లో తీసినట్టు తెలుస్తుంది.

సంతోష్ శోభన్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది.

అన్ని మంచిశకునములే ఈ సమ్మర్ కి సూపర్ ట్రీట్ ఇవ్వనుంది.మే 18న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.హాట్ హాట్ సమ్మర్ కి కూల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

సంతోష్ శోభన్ తన రెండు సినిమాలు అంచనాలను అందుకోలేదు మరి ఈ సినిమా అయినా అతన్ని గట్టెక్కిస్తుందా లేదా అన్నది చూడాలి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు