ఇది అంతం మాత్రం కాదు.. వైరల్ అవుతున్న సందీప్ భార్య జ్యోతి ఎమోషనల్ పోస్ట్!

ఆట షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సందీప్( Sandeep ) బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ కావడం ఆయన ఫ్యాన్స్ కు భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే.

సందీప్ ఎలిమినేట్ కావడం గురించి ఆయన భార్య జ్యోతి( Jyothi ) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

జ్యోతిరాజ్ తన పోస్ట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ లోకి సందీప్ చాలా బలంగా వెళ్లాడని ఆమె అన్నారు.

ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సందీప్ గట్టి పోటీ ఇచ్చాడని జ్యోతిరాజ్ చెప్పుకొచ్చారు.సందీప్ అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకున్నాడని ఆమె కామెంట్లు చేశారు.

అంతే స్ట్రాంగ్ గా బయటికొచ్చాడని ఆమె అన్నారు.దీనికి ఇది మాత్రమే అంతం కాదని జ్యోతిరాజ్ వెల్లడించారు.

Advertisement

లవ్ సింబల్ జత చేస్తూ జ్యోతిరాజ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.ఈ పోస్ట్ కు ఏకంగా 20 వేలకు పైగా లైక్స్ రావడం గమనార్హం.

సందీప్ కు ప్రేమగా ముద్దలు తినిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ జ్యోతిరాజ్( Jyothiraj ) ఈ కామెంట్లు చేశారు.జ్యోతిరాజ్ కామెంట్ల గురించి నెటిజన్లు స్పందిస్తూ జీవితం ఇంకా చాలా ఉందని ఇప్పుడు దీనితోనే జీవితం ఎండ్ కాదని కామెంట్లు చేశారు.అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా శోభ,( Sobha ) అమర్( Amardeep ) కంటే సందీప్ బెటర్ అని మరి కొందరు చెబుతున్నారు.

గత సీజన్లతో పోల్చి చూస్తే బిగ్ బాస్ షో మెరుగ్గానే ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.అయితే మరికొన్ని మెరుగులు అద్దాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్లు ఫీలవుతున్నారు.బిగ్ బాస్ షో మొదలై దాదాపుగా 60 రోజులు కాగా ఈ షో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు