ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్ కావడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ట్రాఫిక్ సమస్యల వల్ల ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేశామని పోలీసులు చెబుతుండగా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా కుమారి ఆంటీ చేసిన కామెంట్ల వల్లే ఆ బిజినెస్ మూతబడిందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
పెద్దగా ఆస్తులు లేని కుమారి ఆంటీకి న్యాయం జరగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే కొన్నిరోజుల క్రితం కుమారి ఆంటీ హోటల్ దగ్గర సందడి చేసిన సందీప్ కిషన్ ఆమె బిజినెస్ క్లోజ్ కావడం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

కుమార్ ఆంటీ ఫుడ్ బిజినెస్ ను క్లోజ్ చేయడం రైట్ కాదని సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.ఎంతోమంది మహిళలకు ఆమె స్పూర్తిగా నిలిచారని సందీప్ కిషన్ కామెంట్లు చేశారు.ఈ మధ్య కాలంలో నేను చూసిన బలమైన సాధికారత మహిళలలో కుమారి ఆంటీ కూడా ఒకరని సందీప్ కిషన్ అభిప్రాయపడ్డారు.నేను, నా టీం కుమారి ఆంటీకి వీలైనంత సహాయం చేస్తామని వెల్లడించారు.
మరి కొందరు మాత్రం యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా వల్ల ఆమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ అయిందని చెబుతున్నారు.కుమారి ఆంటీ మాత్రం తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

అనుమతులు లేకుండా ఫుడ్ విక్రయించడంతో పోలీసులు ఆమె ఫుడ్ బిజినెస్ ను క్లోజ్ చేయడం జరిగింది.ఫుడ్ బిజినెస్ క్లోజ్ కావడంతో రాబోయే రోజుల్లో ఆమె ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లను ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.







