తండ్రి లాండ్రీ ఓనర్.. కూతురు ఆర్మీలో తొలి మహిళా సుబేదార్.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఏ రంగంలో సక్సెస్ సాధించాలన్నా పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు ఎక్కువగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి.అయితే ఆర్మీలో ఒక మహిళ మాత్రం సుబేదార్( Subedar ) ర్యాంక్ కు ప్రమోట్ అయ్యి ప్రశంసలు అందుకుంటున్నారు.

 Preethi Rajak Inspirational Success Story Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

అరుదైన ఘనతను సాధించిన ఈ మహిళ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.ఈ మహిళ పేరు ప్రీతి రజక్( Preethi Rajak ) కాగా రెండు సంవత్సరాల క్రితం ఆర్మీలో హవల్దార్ గా ఈమె చేరారు.

క్రీడలలో ప్రావీణ్యం ఉన్న ప్రీతి రజక్ ఆసియన్ గేమ్స్ లో ట్రాప్ షూటర్( Top Shooter in Asian Games ) గా సిల్వర్ మెడల్ ను సాధించడంతో పాటు ఎంతోమంది మహిళలకు స్పూర్తినిస్తూ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.సిల్వర్ మెడల్ సాధించి దేశంలోని ఎంతోమంది యువతులకు ప్రీతి ఇన్స్పిరేషన్ గా నిలిచిన నేపథ్యంలో ఆమెకు సుబేదార్ ర్యాంక్ ప్రమోట్ అయిందని తెలుస్తోంది.

-Inspirational Storys

ఆర్మీలో సుబేదార్ కావాలంటే ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది.అయితే ప్రీతి మాత్రం ఎంతో కష్టపడి ఒక్కో దశను దాటడం ద్వారా ఈ ఘనతను సులువుగానే సొంతం చేసుకోవడం జరిగింది.1992 సంవత్సరంలో ఆర్మీలో మహిళల రిక్రూట్మెంట్( Women Recruitment in Army ) మొదలు కాగా ఆమె అంచెలంచెలుగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.ఈమె తండ్రి లాండ్రీ ఓనర్ గా పని చేస్తున్నారని సమాచారం అందుతోంది.

మధ్యప్రదేశ్ లోని నర్మదాపురంకు చెందిన ప్రీతి బాల్యం నుంచి ఆటలలో ముందువరసలో ఉండేవారని తెలుస్తోంది.

-Inspirational Storys

జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి ఎన్నో పతకాలను సొంతం చేసుకున్న ప్రీతి 2022 సంవత్సరంలో హవల్దార్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.తాను సుబేదార్ గా ఎంపికైన నేపథ్యంలో నేటి యువతులు ఇళ్లలో కూర్చుని ప్రతిభను వృథా చేయవద్దని ఇంటినుంచి బయటకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ నెల 28వ తేదీన ప్రీతి రజక్ కు సుబేదార్ గా పదవి లభించింది.

రాబోయే రోజుల్లో ప్రీతి ఒలింపిక్స్( Olympics ) లో పాల్గొని మన దేశానికి పతకాన్ని తీసుకునిరావాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube