పవన్ సినిమా కోసం చిరంజీవి సినిమాను వదిలేసిన డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్‌

దర్శకుడిగా.నటుడిగా ఈమద్య కాలంలో సముద్రఖని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

ఏక కాలంలో పది సినిమాల్లోకి పైగా నటిస్తున్న సముద్ర ఖని ఆ మద్య మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా వాల్తేరు వీరయ్య లో ఎంపిక అయిన విషయం తెల్సిందే.ఆయన పాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉందని సమాచారం అందుతోంది.

మెగా 154వ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో సముద్రఖని వినోదయ్య సిత్తం రీమేక్ బాధ్యతలు చేపట్టాల్సి రావడంతో మెగా 154 సినిమా ను వదిలేసుకున్నట్లుగా తెలుస్తోంది.వినోదయ్య సిత్తం సినిమా ను పవన్‌ కళ్యాణ్ హీరోగా సముద్రఖని చేస్తున్న విషయం తెల్సిందే.

ఇటీవలే అఫిషియల్ గా పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.కేవలం నెల రోజుల్లోనే పవన్ కళ్యాణ్‌ తో వినోదయ్య సిత్తం రీమేక్ ను ముగించేందుకు మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

అందుకే సముద్ర ఖని ఇతర ప్రాజెక్ట్ లు అన్ని కూడా కాస్త పక్కకు పెట్టారు అని వార్తలు వస్తున్నాయి.చిరంజీవి సినిమాలో నటించే అవకాశం గొప్పదే అయినప్పటిని వినోదయ్య సిత్తం రీమేక్ విషయంలో సముద్రఖని చాలా ఆసక్తిగా ఉన్నాడు.

తమిళంలో ఒరిజినల్‌ వినోదయ్య సిత్తం కు దర్శకత్వం వహించి కీలక పాత్రలో నటించాడు.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రీమేక్‌ కు కూడా సముద్ర ఖనిని దర్శకత్వం చేయించాలని మేకర్స్ భావించారు.

అందుకే చిరంజీవి వాల్తేరు వీరయ్య నుండి తప్పించి మరీ ఈ సినిమాకు తీసుకు వచ్చారు.వాల్తేరు వీరయ్య సినిమా లో సముద్ర ఖని ని అనుకున్న పాత్రలో మలయాళ నటుడు బీజు మీనన్ ను తీసుకు రాబోతున్నారు.

మొత్తానికి చిరు మూవీని పవన్ సినిమా కోసం వదిలేసుకున్న సముద్రఖని. దర్శకుడిగా కంటే ఈమద్య కాలంలో సముద్రఖనికి నటుడిగా మంచి గుర్తింపు దక్కింది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

అందుకే ఆయన మెగా 154 లో నటిస్తే బాగుండేది అంటూ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు