తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత కేసు తీర్పు కొద్దీ క్షణాల క్రితమే వెలువడింది.ఆ కేసులో ఉన్న ముగ్గురు నిందితులకు ఉరి శిక్షను ఖరారు చేశారు.
దీంతో ఈ తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కేవలం 45 రోజుల్లో ఈ నిందితులకు ఉరిశిక్ష తీర్పు ఇవ్వడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆ ముగ్గురు నిందితులు మాత్రం తీర్పు విని కన్నీరు పెట్టుకున్నట్టు సమాచారం.ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.నవంబర్ 24వ తేదీన అదిలాబాద్ జిల్లాలోని ఎల్లపటూర్ లో సమత అదృశ్యమైంది.దీంతో ఆమె భర్త గోపి పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా ఆమె ఏరోజు అయితే అదృశ్యమైందో ఆరోజే హత్యచారానికి గురయ్యింది అని తేలింది.
దీంతో సమత హత్యాచారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమతపై హత్యాచారం చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే ఈ కేసులో త్వరగా తీర్పు వెలువదలని ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చెయ్యగా ఆ కోర్టులో విచారణ జరపగా సమత హత్యచారానికి సంబంధించిన వాదనలు ఈ నెల 20వ తేదీన ముగిసాయి.
అయితే ఈ కేసు తుది తీర్పు ఈ నెల 27న రావాలి.అయితే కొన్ని అనివార్య కారణాల కారణంగా నేటికీ వాయిదా పడింది.అయితే ఈరోజు కోర్టులో విచారణ జరగగా నేరం చేసినట్టు పక్క సాక్ష్యాలు ఉండటంతో వారికీ కోర్టు ఉరి శిక్ష ఖాయం చేసింది.దీంతో తెలంగాణ ప్రజలు ఈ తీర్పు హర్షం వ్యక్తం చేస్తున్నారు.