విడాకుల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే అన్ని సినీ పరిశ్రమలలో పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్న సమంతకు మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ హీరో కార్తీ పక్కన నటించే అవకాశాన్ని సమంత దక్కించుకున్నట్లు తెలుస్తోంది.నటుడు కార్తీ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకున్నారని చెప్పవచ్చు.
ఇలా తెలుగు తమిళ భాషలలో ఎంతో క్రేజ్ ఉన్న కార్తీ త్వరలోనే సతీష్ సెల్వకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి అయ్యాయని ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలో హీరో కార్తి సరసన నటించడం కోసం హీరోయిన్ వేటలో ఉన్న దర్శకుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతను సంప్రదించినట్లు సమాచారం.

ఇలా దర్శకుడు సతీష్ సెల్వకుమార్ వినిపించిన కథకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.త్వరలోనే ఈ ముద్దుగుమ్మ కార్తి సరసన నటించబోతోందని తెలుస్తోంది.అయితే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఇక సమంత విషయానికి వస్తే… ఈమె నటించిన శాకుంతలం సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.అలాగే సమంత ప్రస్తుతం యశోద అనే మరో సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు.