ఓబేబీ టీజర్‌ రివ్యూ : చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది

సమంత సైలెంట్‌గా పూర్తి చేసిన మూవీ ఓ బేబీ.కొరియన్‌ మూవీ మిస్‌ గ్రానీ చిత్రానికి ఇది రీమేక్‌.

సురేష్‌ ప్రొడక్షన్స్‌లో నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ రీమేక్‌ తెరకెక్కింది.ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఓ బేబీ మూవీ టీజర్‌ తాజాగా బయటకు వచ్చింది.

ఇప్పటికే కథ విషయంలో ఒక క్లారిటీ ఉంది.నిస్థేజంలో ఉన్న ఒక బామ్మ ఫొటో స్టూడియోకు వెళ్లిన సమయంలో అక్కడ అనూహ్యంగా పడుచు అమ్మాయిగా మారిపోతుంది.

ఒక బామ్మ పడుచు అమ్మాయిగా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూపించారు.ఓ బేబీ చిత్రంలో బామ్మ పాత్రను లక్ష్మీ పోషించగా, పడుచు అమ్మాయి పాత్రను సమంత పోషించింది.

Advertisement

ఈ రెండు పాత్రల నడవడిక, బాడీలాంగ్వేజ్‌ సేమ్‌ ఉంటుంది.చాలా విభిన్నమైన చిత్రం అవ్వడంతో సమంత ఈ చిత్రంను చేయడం జరిగింది.

భారీ అంచనాలున్న ఈ చిత్రంను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.జులై నెలలో మంచి సేఫ్‌ జోన్‌లో ఈ చిత్రంను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.ఓ బేబీ చిత్రం టీజర్‌ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.ఇప్పటి వరకు సినిమా గురించి సినీ వర్గాల వారి వరకే చర్చ జరిగింది.ఇప్పుడు ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది.

సినిమాను సైలెంట్‌గా పూర్తి చేసిన కారణంగా పబ్లిసిటీ పెద్దగా జరగలేదు.ఇకపై అయినా పబ్లిసిటీ భారీ ఎత్తున చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు టీజర్‌తో హడావుడి మొదలు పెట్టారు.

త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని పోస్టర్‌లు విడుదల చేయబోతున్నారు.విడుదల తేదీ విషయమై త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు.

ఆ విషయంలో నిజంగానే చాలా కోపం వస్తుంది... అసలు విషయం బయటపెట్టిన దేవిశ్రీ!
Advertisement

తాజా వార్తలు