పాపం చైతూ కోసం సమంత ఎంత కష్టపడుతుందో..!

ప్రేమ వివాహం చేసుకున్న నాగచైతన్య మరియు సమంత చాలా అన్యోన్యంగా జీవితాన్ని సాగిస్తున్న విషయం తెల్సిందే.

వారు ఎంతో ఉత్సాహంగా జీవితాన్ని లీడ్‌ చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉంటున్నారు.

ప్రస్తుతం నాగచైతన్య మరియు సమంతలు హైదరాబాద్‌లోని ఒక ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నారు.ఇన్నాళ్లు షూటింగ్స్‌తో ఇద్దరు బిజీ బిజీగా ఉండటంతో ఎక్కువ శాతం బయట తింటూ ఉండేవారు.

కాని ఇప్పుడు మాత్రం ఇద్దరు ఇంట్లోనే ఉంటున్న కారణంగా సొంతంగా వంట చేసుకుంటున్నారు.

బయట వంటలు తినే పరిస్థితి లేని కారణంగా సమంత స్వయంగా రూఫ్‌ గార్డెన్‌ పెట్టి కూరగాయలు పండిస్తూ ఉంది.ఇదే సమయంలో వంట కూడా నేర్చేసుకోవాలని సమంత ఫిక్స్‌ అయ్యింది.అందుకోసం ఒక ప్రత్యేకమైన ట్రైనర్‌ను కూడా సమంత పెట్టుకుంది.

Advertisement

తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలను సమంత పోస్ట్‌ చేసింది.నాగచైతన్య కోసం సమంత ఏకంగా వంట నేర్చుకుంటున్న విషయం నెట్టింట వైరల్‌ అవుతోంది.

హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా కోలీవుడ్‌లో కూడా సత్తా చాటిన ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం సినిమాకు కాస్త దూరంగా ఉంటుంది.ఈ ఏడాది కాంలో సమంత ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.ఒక తమిళ వెబ్‌ సిరీస్‌లో మినహా ఈమె మరే సినిమాలో కూడా నటించిన దాఖలాలు లేవు.

వచ్చే ఏడాదిలో ఒక సినిమా చేయబోతుంది.గతంలో మాదిరిగా వరుసగా సినిమాలు అయితే చేయడం లేదు.

కనుక చైతూ కోసం వంట నేర్చుకుని ఆయనకు వండి వార్చాలని ఆశపడుతుందట.అందుకే ఇలా వంట నేర్చుకుంటుంది.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు