నాగచైతన్య కోసం ఆ మూవీ ఆఫర్ ను వదులుకున్న సామ్.. ఏమైందంటే?

కొన్ని నెలల క్రితం వరకు నాగచైతన్య సమంత జోడీ టాలీవుడ్ క్యూట్ కపుల్ గా వార్తల్లో నిలిచింది.అయితే ఎవరి దిష్టి తగిలిందో కానీ ఎవరూ ఊహించని విధంగా విడిపోతున్నామని ప్రకటన చేసి చైతన్య, సమంత అభిమానులకు ఊహించని స్థాయిలో షాక్ ఇచ్చారు.

 Samantha Missed Chance Because Of Young Hero Nagachaitanya Details Here , At-TeluguStop.com

చైసామ్ విడిపోయి ఎనిమిది నెలలైనా చైసామ్ విడాకుల ప్రకటన నమ్మలేని నిజం అని అభిమానులు భావిస్తున్నారు.వీళ్లిద్దరూ విడిపోవడానికి సంబంధించి అసలు కారణాలు వెలుగులోకి రాలేదు.

అయితే రాబోయే రోజుల్లో వీళ్లిద్దరి విడాకుల ప్రకటనకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని అభిమానులు భావిస్తున్నారు.అయితే పెళ్లి తర్వాత సమంతకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొన్ని మంచి ప్రాజెక్ట్ లలో ఆఫర్లు వచ్చినా ఆ ఆఫర్లను మాత్రం సమంత వదులుకున్నారు.

షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటించే అవకాశం మొదట సమంతకు దక్కింది.అయితే అప్పట్లో చైతన్య కోసం సమంత ఈ ఆఫర్ ను వదులుకున్నారు.

జవాన్ పేరుతో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా అప్పట్లో సమంత ఈ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో నయనతారకు ఈ సినిమాలో నటించే అవకాశం దక్కింది.సమంత అప్పట్లో స్టార్ హీరోల ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పి ఉంటే హీరోయిన్ గా సమంత రేంజ్ కచ్చితంగా మరింత పెరిగి ఉండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సమంత నటించిన శాకుంతలం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.

Telugu Atlee, Chance, Samantha, Shahrukh Khan, Sharukh Khan-Movie

ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజుకు కూడా భాగస్వామ్యం ఉందని అయితే తాజాగా దిల్ రాజు ఈ సినిమా భాగస్వామ్యం నుంచి తప్పుకున్నాడని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.శాకుంతలం రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube