టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత(Samantha) ఒకరు.దాదాపు పుష్కర కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడటంతో కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ చికిత్స తీసుకుంటూ ఉన్నటువంటి సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

సోషల్ మీడియా( Social media ) వేదికగా సమంత తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైనటువంటి విషయాలను కూడా ఈమె అభిమానులతో పంచుకుంటున్నారు అదేవిధంగా తనకు వీలు కుదిరిన ప్రతిసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు.ఇటీవల అభిమానులతో ముచ్చటించినటువంటి ఈమెకు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఎదురయింది.

ఈ సందర్భంగా ఒక నెటిజన్ సమంతను ప్రశ్నిస్తూ మీరు మీ జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటి అనే ప్రశ్న వేస్తే మీ సమాధానం ఏంటి అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ.నేను నా జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటి అంటే నా ఇష్ట అయిష్టాలను గ్రహించలేకపోయాను.ఈ విషయాన్ని నేను చాలా ఆలస్యంగా గ్రహించానని ఆ సమయంలో నేను సరైన నిర్ణయం తీసుకోకపోవడంలో నేను విఫలమయ్యాను.
క్లిష్ట సమయంలోనే మనం విలువైన పాఠాలను నేర్చుకోగలమని తెలుసుకున్న సమయంలోనే నా జీవితంలో ఎదుగుదల కూడా మొదలైందంటూ సమంత చెప్పినటువంటి ఈ సమాధానం వైరల్ గా మారింది.







