నకిలీ పాస్ పోస్టుల తయారీపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.ఈ మేరకు జగిత్యాల జిల్లాలోని మూడు ప్రాంతాల్లో సీఐడీ పోలీసులు సోదాలు నిర్వహించారు.
పక్కా సమాచారం మేరకు అక్రమంగా పాస్ పోర్టులను తయారు చేస్తున్న ప్రాంతాలపై ఏకకాలంలో దాడులు చేశారు.ఈ తనిఖీల్లో ఇద్దరు డీఎస్పీలు, పది మంది సీఐలు, నలుగురు ఎస్ఐలు పాల్గొన్నారు.
అలాగే పాస్ పోర్ట్ ఏజెంట్ల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు.అనంతరం పాస్ పోర్టులతో పాటు వాటి తయారీకి కావాల్సిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే ముగ్గురు ఏజెంట్లను విచారిస్తున్నారని తెలుస్తోంది.
.






