సమంతకి 30 లక్షలు, అల్లు అర్జున్‌ కి 10 లక్షలు

అదేంటి వీళ్ళిద్దరు సినిమా చేస్తే కోట్లలో ఛార్జ్ చేస్తారు కదా.పైగా సమంత కంటే అల్లు అర్జున్‌ రేటు ఎంతైనా ఎక్కువే కదా అని అలోచిస్తున్నారా? టాపిక్ పారితోషికం గురించి కాదు, అలాగని కరెన్సి నోట్ల గురించి కూడా కాదు.

ట్విట్టర్ ఫాలోయంగ్ గురించి.

యాదృచ్ఛికంగా ఇటు సమంత, అటు అల్లు అర్జున్, ఇద్దరు ఒకేరోజున ట్విట్టర్ లో కొత్త మైలురాళ్ళను అందుకున్నారు.ఇప్పుడు సమంత ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 30 లక్షలు.

ఇక అల్లు అర్జున్ 10 లక్షల ఫాలోవర్స్ ని సంపాదించి మిలియన్ క్లబ్ లో చేరిపోయాడు.దక్షిణాది కథనాయికలలో సమంతది రెండొవస్థానం.

శృతిహాసన్ కి 43 లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు.ఇక తెలుగు హీరోల విషయానికి వస్తే మహేష్ బాబుకి 25 లక్షలమంది, రానా దగ్గుబాటికి 21 లక్షలమంది, అక్కినేని నాగార్జునకి 18 లక్షలమంది, నాని, అల్లు అర్జున్, ఇద్దరికీ 10 లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు.

Advertisement

దర్శకుల విషయానికి వస్తే, రాజమౌళికి 23 లక్షలమంది, రామ్ గోపాల్ వర్మకి 21 లక్షలమంది, పూరి జగన్నాథ్ కి 12 లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు.ఇక మిగిలిన స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ సంఖ్య 9.80 లక్షలు కాగా, ఎన్టీఆర్ ఫాలోవర్స్ సంఖ 7.06 లక్షలు.

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎవరి కూతురో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు