Samantha Naga Chaitanya : సమంత ప్రాణం చైతు దగ్గరకు వెళ్లిందా… చూస్తుంటే త్వరలోనే కలుసుకునేలా ఉన్నారే?

టాలీవుడ్ క్రేజీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సమంత ( Samantha ) నాగచైతన్య( Naga Chaitanya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏం మాయ చేసావే సినిమా ద్వారా కలిసిన నటించిన వీరిద్దరూ అనంతరం పలు సినిమాలలో నటించారు.

 Samantha Hash With Naga Chaitanya Video Viral-TeluguStop.com

ఇలా సినిమాలలో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం జరిగింది.ఇలా పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట మూడు సంవత్సరాల పాటు సంతోషంగా ఉన్న అనంతరం విభేదాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.

వీరివిడాకుల గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి.

ఇలా విడాకులు( Chay Sam Divorce ) తీసుకున్నటువంటి ఈ జంట కెరియర్ పరంగా సినిమాలు చేసుకుంటూ ఇద్దరు కూడా బిజీగా ఉన్నారు.అయితే వీరిద్దరూ కలుసుకుంటే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు.అయితే ఆ అభిమానుల కోరిక నెరవేరబోతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం సమంత నాగచైతన్యల వ్యవహారం చూస్తుంటే త్వరలోనే వీరిద్దరూ కలుసుకోబోతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.ఇలా సమంత నాగచైతన్య తిరిగి కలుసుకుంటే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చైతన్యకు సంబంధించిన ఎలాంటి జ్ఞాపకాలను తన వద్ద ఉండకుండా జాగ్రత్త పడింది .ముఖ్యంగా తన పెళ్లిలో దిగినటువంటి ఫోటోలు( Samantha Naga Chaitanya Marriage Photos ) కనపడకుండా దాచి పెట్టారు.అయితే గత కొద్దిరోజుల క్రితం సమంత నాగచైతన్య పెళ్లి ఫోటో సమంత ఇన్స్టాగ్రామ్ లో దర్శనం ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.దీన్ని బట్టి చూస్తుంటే సమంత నాగచైతన్య త్వరలోనే కలుసుకునే ఆలోచనలో ఉన్నారని అందరూ భావించారు.

అయితే తాజాగా సమంతకు ప్రాణానికి ప్రాణమైనటువంటి తన పెట్ డాగ్ ఒక్కసారిగా చైతన్య వద్ద దర్శనం ఇవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు.

సమంతకు ఎంతో ఇష్టమైనటువంటి పెట్ డాగ్ హష్ ( Samantha Pet Dog Hash ) గురించి చెప్పాల్సిన పనిలేదు సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత దానిని కూడా తనతో పాటే తీసుకువెళ్లారు.గత కొద్ది రోజుల క్రితం ఆమె కుక్కపిల్లతో కలిసి ఫోటోలు దిగిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈ హష్ నాగచైతన్య వద్ద ఉండటంతో అందరూ షాక్ అవుతున్నారు.

ఇదేంటి సమంతకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ హష్ నాగచైతన్య వద్ద ఉంది అంటూ ఆశ్చర్యపోతున్నారు తాజాగా ఇందుకు సంబంధించినటువంటి ఒక వీడియో కూడా వైరల్ గా మారింది.

తాజాగా నాగచైతన్య అభిమాని( Naga Chaitanya Fan ) కొత్త బైక్ కొనుగోలు చేసి నాగ చైతన్య ఆటోగ్రాఫ్ కోసం ఆ బండిని తన వద్దకు తీసుకువెళ్లారు.అయితే అభిమాని కొత్త బండి పై నాగచైతన్య ఆటోగ్రాఫ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కుక్కపిల్ల అక్కడికి వచ్చింది.దీంతో నాగచైతన్య హష్ గో దేర్ అని చెబుతూ దానిని అక్కడి నుంచి పంపించేశారు.

ఇలా సమంత దగ్గర ఉండాల్సిన ఈ హష్ నాగచైతన్య వద్దకు వచ్చింది అంటే త్వరలోనే వీరిద్దరూ కలుసుకోబోతున్నారని పలువురు భావిస్తున్నారు.ఇలా సమంత నాగచైతన్య ఇద్దరు కూడా నిజంగానే కలుసుకుంటే అంతకన్నా సంతోషం అక్కినేని అభిమానులకు అలాగే సమంత అభిమానులకు ఉండదని చెప్పాలి.

మరి సమంత నాగచైతన్య ఇద్దరు కూడా ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube