సమంత 'శాకుంతలం' ప్రివ్యూ

సమంత( Samantha ) హీరోయిన్ గా నటించిన శాకుంతలం( Sakunthalam ) చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రస్తుతం సినిమా కి సంబంధించిన విడుదల కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న శాకుంతలం చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు అంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

దిల్ రాజు ఈ సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నాడు.మలయాళ నటుడు దేవ్ మోహన్( Dev Mohan ) ఈ సినిమా లో దుశ్యంత మహారాజు పాత్ర లో కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచుతూనే ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందా అంటే తప్పకుండా ప్రతి ఒక్కరిని మెప్పించే విధంగా ఉంటుంది అంటూ దర్శకుడు గుణశేఖర్ చాలా నమ్మకంగా చెబుతున్నాడు.

Advertisement

సమంత కాస్త గ్యాప్ తీసుకుని అనారోగ్య సమస్యల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అన్ని భాషల్లో కూడా విడుదల కాబోతుంది.సమంత కి ఉన్న క్రేజ్ నేపథ్యం లో ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ బిజినెస్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.

ఈ సినిమా ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ఏ స్థాయిలో కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

సమంత యొక్క స్టార్ డం కి ఇది పెద్ద పరీక్ష అనడంలో సందేహం లేదు.ఈ సినిమా ఫలితాన్ని బట్టి తర్వాత సినిమా ఖుషి ప్రీ రిలీజ్ బిజినెస్ ఉంటుంది అనడంలో సందేహం లేదు.

అందుకే ఖుషి హీరో రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ ఆసక్తిగా ఈ సినిమా వైపు చూస్తున్నారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు