సల్మాన్ ఖాన్ తో ఎలాంటి సినిమా చేయలేదు... అసలు విషయం చెప్పిన సమంత?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత( Samantha ) ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించి మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

అలాగే పుష్ప( Pushpa ) సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా కూడా సమంతకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.దీంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసే అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నటువంటి సమంత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ విధంగా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బాలీవుడ్ డైరెక్టర్ నిర్మాత కరణ్ జోహార్ ( Karan Johar ) నిర్మాణంలో సల్మాన్ ఖాన్ ( Salmaan Khan ) నటిస్తున్నటువంటి తాజా చిత్రంలో సమంత హీరోయిన్గా నటించబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.దీంతో సమంత ఏడాది పాటు విరామం ఇచ్చి తిరిగి సినిమాలకు కమిట్ అవుతున్నారు ఏంటి అని సందేహం అందరిలోనూ నెలకొంది.ఈ విధంగా సల్మాన్ ఖాన్ సినిమాలో సమంత నటిస్తున్నారు అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై తాజాగా సమంత స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంత సోషల్ మీడియాలో ( Social media )మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి ఈమె అభిమానులతో ముచ్చటించారు.వారు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెబుతూ వచ్చారు.

ఈ క్రమంలోని ఒక నేటిజెన్ మీ తదుపరి సినిమా ఏంటి అని అడగడంతో తాను ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్టులు చేయలేదని ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు అంటూ చెప్పుకొచ్చారు.దీంతో సల్మాన్ ఖాన్ సినిమాలో సమంత నటిస్తుందన్న వార్త కేవలం ఒక పుకారు మాత్రమేనని ఇందులో ఏ మాత్రం నిజం లేదని సమంత ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదని క్లారిటీ వచ్చేసింది.

Advertisement

తాజా వార్తలు