Samantha : ఆ నిర్ణయం ఎంతో కఠినమైనది.. అయినా తప్పలేదు సమంత ఎమోషనల్ కామెంట్స్?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సమంత ( Samantha ) ఒకరు.ఈమె దాదాపు 14 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అగ్రతారగ కొనసాగుతూ సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.

 Samantha Emotional Comments On Her Career-TeluguStop.com

ఇలా కెరియర్ పరంగా బిజీ అయినటువంటి సమంత ఉన్నఫలంగా మయోసైటిసిస్ వ్యాధికి గురి అయ్యారు.ఈ వ్యాధి కారణంగా ఈమె ఏకంగా ఏడాది పాటు సినిమాలకు విరామం ( Break ) తీసుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి హీరోయిన్ ఏడాది పాటు ఇండస్ట్రీకి విరామం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

ఇలా సమంత ఖుషి సినిమా( Khushi movie ) తర్వాత ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు.తాను ఏడాది పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వడం గురించి తాజాగా ఈమె స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాను కెరియర్ పరంగా ఏడాది పాటు బ్రేక్ తీసుకోవడం అనేది చాలా కఠినమైన నిర్ణయం అని ఈమె తెలిపారు.

అయినా ఈ నిర్ణయం తప్పలేదు తనకు కెరియర్ కంటే ఆరోగ్యమే ( Health ) ముఖ్యం అని సమంత తెలిపారు.

ఇకపై ఎలాంటి బ్రేక్ ఉండదని భావిస్తున్నాను అయినా నేను ఏడాది పాటు ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకున్నది సమయం వృధా చేయడానికి కాదని ఆరోగ్యం కోసమేనని తెలిపారు.ఆరోగ్యం కోసం నేను చాలా వదులుకోవాల్సి వస్తుందని నాకు తెలుసు కానీ తప్పలేదు అంటూ సమంత తన ఆరోగ్యం గురించి ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వడం గురించి ఈ సందర్భంగా మాట్లాడినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతుంది.ఇక ఈమె ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకున్నారని తెలుస్తుంది.

త్వరలోనే గ్రాండ్ గా  సమంత రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube