సమంత విడాకులతో రాజకీయాలా.. ఆమెను లాగడం ఎంతవరకు రైట్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha )సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

అనవసర విషయాలలో, వివాదాలలో జోక్యం చేసుకోవడానికి ఆమె ఆసక్తి చూపించరు.

అయితే ఈరోజు ఒక వివాదం వల్ల సోషల్ మీడియా వేదికగా ఆమె పేరు వైరల్ అవుతోంది.సమంత విడాకులతో రాజకీయాలా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

సమంతను వివాదంలో లాగడం ఎంతవరకు రైట్ అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.ఎంతో కష్టపడి సమంత టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.

సమంతను అనవసర వివాదాల్లోకి లాగడం విషయంలో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సమంత అనుమతి లేకుండా ఆమె గురించి ఇష్టానుసారం గాసిప్స్ ప్రచారం చేయడం సరి కాదు.

Advertisement

తన విడాకులకు రాజకీయ నాయకులు( Politicians ) కారణమని సమంత సైతం ఎక్కడా చెప్పలేదనే సంగతి తెలిసిందే.మరి అలాంటప్పుడు ఏ మాత్రం సంబంధం లేని వివాదంలో ఆమె పేరును ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.సమంత త్వరలో కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంపై మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

సమంత పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉందనే సంగతి తెలిసిందే.సమంత ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.సమంత ఒక్కో మెట్టు పైకి ఎదిగి కెరీర్ పరంగా ఈ స్థాయికి చేరుకున్నారు.

ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది.సమంత కెరీర్ ప్లాన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు.

22 ఏళ్లుగా పాక్‌లో నరకయాతన.. ఒక్క యూట్యూబ్ వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది..?
మంచి మనసు చాటుకున్న శర్వానంద్... కూతురి పేరుతో అలాంటి సేవ!

సమంత ఇతర భాషల్లో సైతం కెరీర్ పరంగా మరింత సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు