రాజన్న సిరిసిల్ల జిల్లా లో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ(Vemulawada) పట్టంలో విసిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టిపెట్టి క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేయాలని,పట్టణ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.స్థానికంగా ఉండే శాంతి భద్రతల సమస్యలు, రౌడీ షీటర్లు మరియు హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.
పోలీస్ స్టేషన్(police station ) లో గల పెండింగ్ కేసులపై సమీక్షించి వాటికి గల కారణాలు అడిగి తెలుసుకొని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు.స్టేషన్ నందు పని చేస్తున్న సిబ్బందిని నామినల్ రోల్ ఆధారంగా సిబ్బంది ఏయే ఏయే విధులు నిర్వర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
బ్లూ కోల్ట్ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.ఎస్పీ వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సి.ఐ వీరప్రసాద్, ఎస్.ఐ అంజయ్య ఉన్నారు.