మోకాళ్ల నొప్పితోనే తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్.. కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

అంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ( Power Star Pawan Kalyan )ఇటీవ‌ల తిర‌మ‌ల ల‌డ్డూ క‌ల్తీ నేప‌థ్యంలో ప్రాయశ్చిత దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.సెప్టెంబరు 22 నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉన్న ఆయన తాజాగా ఆ దీక్ష విర‌మించేందుకు గాను పవన్‌ మంగ‌ళ‌వారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం రేణిగుంట ఎయిర్‌ పోర్టుకు ( Airport to Renigunta Airport )చేరుకున్నారు.భద్రతా సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలని పోలీసులు సూచించడంతో అలిపిరి నుంచి తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు.మెట్ల మార్గంలో వెళ్లి దీక్ష విరమించనున్నట్టు ఇదివరకే ప్రకటించడంతో సాయంత్రం 4.50 ప్రాంతంలో అలిపిరి చేరుకుని అలిపిరి పాదాల మండపం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి పటిష్ఠ భద్రత మధ్య పవన్‌ కల్యాణ్‌ స్వ‌యంగా నడక మొదలు పెట్టారు.

 Deputy Chief Minister Pawankalyan Reached Tirumala, Deputy Chief Minister, Pawan-TeluguStop.com
Telugu Deputy, Pawan Kalyan, Tirumala, Tollywood-Movie

రెండు మోకీళ్లకు బెల్ట్‌లు ధరించినప్పటికీ మెట్లు ఎక్కే క్రమంలో పవన్‌లో అలసట కనిపించింది.మధ్య మధ్యలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.మోకాళ్ల పర్వతం వరకు వేగంగా నడిచారు.అక్కడ కాళ్ల నొప్పి తీవ్రం కావడంతో ఫిజియోథెరపీ( Physiotherapy ) తీసుకోవాల్సి వచ్చింది.ఒక దశలో మోకాళ్ల పర్వతం నుంచి వాహనంలో తిరుమలకు వెళతారన్న ప్రచారం కూడా జరిగింది.దీనికి అనుగుణంగా సిబ్బందీ అప్రమత్తం అయ్యారు.అయితే ఏడో మైలు నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ రాత్రి 9.20 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు.వాహనాలు సిద్ధంగా ఉంచినప్పటికీ ఆర్టీసీ బస్టాండు వరకు నడిచారు పవన్.

Telugu Deputy, Pawan Kalyan, Tirumala, Tollywood-Movie

అయితే అప్పటికే అక్కడికి భారీగా అభిమానులు చేరుకోవడంతో ఆర్టీసీ బస్టాండు నుంచి వాహనంలో గాయత్రి సదన్‌( Gayatri Sadan ) కు చేరుకున్నారు.రాత్రికి అక్కడే బస చేశారు.తిరిగి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలించి అక్కడి నుంచి గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు.అయితే మోకాలు నొప్పి కాలినొప్పి ఉన్నా కూడా రెస్టు తీసుకోకుండా పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకోవడంతో అభిమానులు పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కష్టానికి ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube