మంత్రి కేటీఆర్ పై సమంత కామెంట్.. క్రేజీ పోస్ట్ తో రిప్లై?

గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న సెలబ్రిటీ పేరు ఏదైనా ఉందా అంటే అందరూ సమంత పేరు చెబుతారు.

అయితే విడాకులే ప్రకటన తర్వాత సమంత పూర్తి తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు.

నాలుగేళ్ల తమ వివాహ బంధానికి పులిస్టాప్ పడటంతో ఆ బాధ నుంచి బయట పడటానికి సమంత ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తూ ఇప్పుడిప్పుడే బయటపడుతుంది.ఇకపోతే ఇప్పటివరకు పలు సినిమాల గురించి సామాజిక అంశాల గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించే సమంత తాజాగా రాజకీయాలపై తన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ పై సమంత కామెంట్స్ చేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక అసలు విషయానికి వస్తే తాజాగా తెలంగాణలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిల్లల సంక్షేమం కోసం బాల రక్షక్ అనే అంబులెన్సులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి తనని అభినందిస్తూ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ఆపదలు పిల్లలను ఆదుకోవడానికి జిల్లాకు ఒకటి చొప్పున 33 అంబులెన్సులను ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని కేటీఆర్ పొగుడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Advertisement

ఇక సమంత ఈ పోస్ట్ పై స్పందించారు.ఈ క్రమంలోనే కేటీఆర్ చేసిన పోస్టులను సమంత తన ఇన్ స్టోరీస్ లో పోస్ట్ చేస్తూ.దండం పెడుతూ.

క్లాప్స్ కొడుతున్న ఎమోజీలను షేర్ చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.అలాగే ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు