ఈ మధ్య యూట్యూబ్ ఇంటర్వ్యూ అంటేనే పరమ రోత… కంటెంట్ ఉండదు, అడ్డగోలు థంబ్ నెయిల్స్, వెగటు పుట్టించే డిస్కషన్స్.అలనాటి స్టార్స్ ని తెచ్చి కూడా అదే చెత్త ప్రశ్నలు.
జర్నలిజం మీనింగ్ కూడా తెలియదు.హుందాగా వ్యవహరించడం, సంస్కారం అనే పదాలు వారి డిక్షనరీ లోనే ఉండవు.
ఆలా ఉంటె వ్యూస్, డబ్బులు రావు అనేది వారి వాదన.ఇంత చెత్త నడుమ యశోద సినిమా ప్రమోషన్స్ కోసం సమంత యాంకర్ సుమకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూ చూసాక పరిణితి, పరిపక్వత, సంస్కారం, హుందాతనం ఇలాగ కూడా ఉంటుందా అనిపించింది.అంత అద్భుతంగా ఇద్దరు ఈ ఇంటర్వ్యూ ని నడిపించారు.
అక్కడ ఉంది సుమ కాబట్టి, ఇంటర్వ్యూ ఇచ్చింది సమంత కాబట్టి ఆ పద్దతిలో సాగింది.అదే ఇంటర్వ్యూ ఇంకో యాంకర్ చేస్తే పరిస్థితి ఇలాగ ఉండేదా అంటే అనుమానమే.
సమంత వ్యాధి గురించి ప్రస్తావన రాగానే ఇంకో యాంకర్ అయితే ఆమెను ఓదార్చే ప్రయత్నం లో మరింత కంపు చేసి లేచి వెళ్లి సమంత ను దగ్గరకు తీసుకొని చండాలం చేసేవారు.కానీ చేస్తుంది సుమ కాబట్టి ఆమె కుర్చీ లో నుంచి లేవలేదు.
చాల సమన్వయం గా ఆమె వ్యవహరించింది.అది మరి సుమ బ్యాలెన్స్ అంటే.
సమంత కూడా ఎంతో భావోద్వేగాన్ని మొఖంలో చిరునవ్వు చెదరకుండా చెప్పిన తీరు అద్భుతం.నేను చచ్చినట్టు హెడ్ లైన్స్ పెడుతన్నారు.
నను ఇంకా చావలేదు, చావను అంటూ ఆమె చెప్పినప్పుడు ఆమె మొహం లో ఎలాంటి కోపం లేదు.

చాల క్యాజువల్ గా ఈ మాటలను చెప్పిన ఆమె కన్నీళ్లు మాత్రం ఆమెకు సంబంధం లేకుండానే కారుతుంటే చేత్తో తుడుచుకుంది.ఆ టైం లో సుమ సైతం ఎలాంటి జాలిని సమంత పై కురిపించలేదు.నువ్వు గొప్ప ఫైటర్ అంటూ కితాబు ఇచ్చింది.
నువ్వు ఒక సెలెబ్రెటివి నీలోని ఫైటింగ్ స్పిరిట్ ఎంతో గొప్పది.నువ్వు పెట్టె ప్రతి పోస్ట్ లో ఒక్కో కథ ఉంటుంది.
నీకు గొంతు లో ఎదో చిన్న సమస్య ఉంటె గొంతు క్యాన్సర్ అని నమ్మే సమాజం ఇది.ఇలాంటివన్నీ లైట్ తీసుకోవాలి అంటూ సమంతకు చెప్పుకోచ్చింది.సమంత ఒక పెద్ద హీరోయిన్ అయినా ఆమెకు కావాల్సింది జాలి కాదు.మంచి సప్పోర్ట్ మాత్రమే.







