మరో ఐటెం సాంగ్ లో సామ్.. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోతో స్టెప్పులు!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.

 Sam Item Number In Ranbir Kapoor And Sandeep Reddy Vanga Animal Movie, Shaakunta-TeluguStop.com

ఈమె కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వరుస ఫోటో షూట్ మాత్రం ఆపడం లేదు.ఎప్పుడు కాళీ దొరికినా ఫోటో షూట్స్ లో పాల్గొంటూ.

వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

ఈమె ఫోటో షూట్స్ తో ప్రతి నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

బికినీ వేసుకుని ఘాటు అందాలు చూపిస్తూ ఎప్పుడు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తూ ఉంటుంది.అయితే ఈమెపై ట్రోల్స్ కూడా అదే స్థాయిలో వస్తాయి.అయినా ఈమె పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోతుంది.ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండడం వల్ల ఫాలోవర్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నారు.

ఇక ఈమె ప్రెసెంట్ నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.

ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా ఈమె సినీ అవకాశాల కోసం ట్రై చేస్తుంది.అయితే ఈమె పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఒక ఊపు ఊపేసింది.

విడాకుల తర్వాత ఈమె చేసిన ఈ ఐటెం సాంగ్ తో ఈమె పేరు మారుమోగిపోయింది.

Telugu Animal, Item, Khushi, Ranbir Kapoor, Samitem, Samantha, Sandeepreddy, Sha

‘ఊ అంటావా మావా’ సాంగ్ తో ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే.ఈమె ఫోటో షూట్లలో ఇంత బోల్డ్ గా కనిపించడానికి బాలీవుడ్ లో పెద్ద అవకాశాల కోసమే అని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈమె బాలీవుడ్ లో మరో ఐటెం సాంగ్ చేయబోతుంది అని టాక్ వినిపిస్తుంది.

రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న యానిమల్ సినిమాలో ఈ అమ్మడు ఐటెం సాంగ్ చేయబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే వరుస క్రేజీ సినిమాల్లో నటిస్తున్న సామ్ ఐటెం సాంగ్ కు ఓకే చెబుతుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube