ఆ ఏరియాలో బాలయ్య రికార్డ్ ను టచ్ చేయలేకపోయిన సలార్.. అక్కడ బాలయ్యే తోపు అంటూ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సినీ అభిమానుల మధ్య ప్రధానంగా సలార్ సినిమా( Salaar ) గురించి చర్చ జరుగుతోంది.

ప్రశాంత్ నీల్( Prashanth Neel ) సలార్ సినిమాను తెరకెక్కించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

కొన్ని ఏరియాలలో సలార్ మూవీ బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేసింది.హిందీలో సలార్ సినిమాకు ఏకంగా ఏకంగా 15 కోట్ల రూపాయల రేంజ్ ఓ కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది.

అయితే అన్ని ఏరియాలలో ఈ సినిమా సంచలనాలు సృష్టించగా సీడెడ్ లో మాత్రం ఆర్.ఆర్.ఆర్, వినయ విధేయ రామ, వీరసింహారెడ్డి సినిమాలు సలార్ కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించిన సినిమాల జాబితాలో ఉన్నాయి.వీరసింహారెడ్డి( Veerasimha Reddy ) సీడెడ్ కలెక్షన్లు 6.55 కోట్ల రూపాయలు కాగా సలార్ సినిమాకు మాత్రం 6 కోట్ల 45 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.టికెట్ రేట్లు పెంచినా మార్నింగ్ 7 గంటల నుంచే షోలు మొదలైనా సలార్ మాత్రం వీరసింహారెడ్డి రికార్డ్ లను బ్రేక్ చేయలేదు.

సీడెడ్ లో బాలయ్యే ( Balakrishna ) తోపు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.సలార్ సినిమా సీడెడ్ హక్కులు ఏకంగా 24 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ కావాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.

Advertisement

సలార్ సంచలనాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సలార్ 1 సినిమా భారీ స్థాయిలో సక్సెస్ సాధించడంతో పాటు సలార్ 2పై( Salaar Part 2 ) అంచనాలను పెంచింది.బాహుబలి సిరీస్ ను ప్రశాంత్ నీల్ ఈ విషయంలో ఫాలో అయ్యారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనర్హం.సలార్ మూవీ సక్సెస్ తో ప్రభాస్( Prabhas ) అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

సలార్ మూవీ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో కలెక్షన్ల విషయంలో సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు